Begin typing your search above and press return to search.
రోజురోజుకి పెరిగిపోతున్న ఉద్రికత్త..పొలిటికల్ టర్న్ తీసుకుంటున్న దివిస్ వ్యవహారం!
By: Tupaki Desk | 18 Dec 2020 12:30 PM GMTతూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకలలో దివిస్ ల్యాబరేటరీస్ ముందు రైతుల ఆందోళన రోజురోజుకీ మరింత ఉద్రిక్తంగా మారుతోంది. దివిస్ కంపెనీలోకి దూసుకెళ్లేందుకు ఆందోళన కారులు ప్రయత్నాలు చేయడంతో అక్కడ పరిస్థితులు చేజారుతున్నాయి. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి హింసాత్మకంగా మారుతోంది. తాజాగా ఆందోళనకారులు కంటైనర్ కు నిప్పుపెట్టారు. అలాగే జనరేటర్ ను తగులబెట్టి గోడలను కూల్చేశారు. ఒక్కసారిగా వందల మంది ఉద్యమకారులు లోపలకు చొచ్చుకు రావడంతో అక్కడ ఏమి జరుగుతుందో తెలియని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అక్కడకు చేరుకున్న పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితి చేయిదాటుతుందని భావించడంతో 50మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని వెంటనే విడుదల చేయాలని, స్థానికులు అక్కడే బైఠాయించారు. కాగా, దివిస్ కు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా రైతులు దీక్ష చేస్తున్నారు. దివీస్ ల్యాబరేటరీస్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానిక రైతులు, వామపక్షలు గత కొన్నేళ్లుగా ఆందోళన చేస్తున్నాయి. పరిశ్రమ మెయిన్ గేట్ ఎదురుగా నిరసన శిబిరం ఏర్పాటు చేసి తమ నిరసన తెలుపుతున్నారు. కాలుష్యకారక పరిశ్రమ నిర్మాణం చేపట్టవద్దంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి
ఈ నేపధ్యంలో అక్కడ 144 సెక్షన్ అమలులో ఉంది. తూర్పుతీరంలో ఉన్న దివిస్ లేబరేటరీస్ ల్యాబ్, పొలిటికల్ గేమ్ కు అద్దం పడుతోంది. కొత్త యూనిట్ ఏర్పాటుపై అధికార, టీడీపీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు అనుమతిచ్చిన టీడీపీ ఇప్పుడు వ్యతిరేకిస్తోంది. గతంలో ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేస్తామన్న వైసీపీ అధికారంలోకి వచ్చాక మాట మార్చడంతో స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దివిస్ ల్యాబ్‌ను ఒప్పుకునేది లేదని స్థానికులు చెప్తున్నారు.
దివీస్ పరిశ్రమపై 2016 జూన్ 22న పంపాదిపేటలో కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 14 గ్రామాల నుంచి వందలాది మంది 2016 ఆగస్టు నుంచి ఉద్యమం నడిపారు. ఆ ఏడాది చివరి వరకూ సాగిన ఈ ఉద్యమంపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. బడుగు, బలహీనవర్గాలు, దళిత రైతులు, మత్స్యకారులపై కక్ష కట్టి, కోన ప్రాంతంలో 82 రోజుల పాటు పోలీసు రాజ్యం నడిపించింది. అయితే సీన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. దివీస్ పరిశ్రమకు 500 ఎకరాలు కేటాయించినట్టు అసెంబ్లీ సాక్షిగా అప్పటి ఆర్థిక మంత్రి యనమల ప్రకటించారు. పరిశ్రమ వద్దంటూ పోరాటం చేస్తున్న మమ్మల్ని హింసించారు. తప్పుడు కేసులు బనాయించారు. అప్పుడలా చేసి ఇప్పుడు స్థానికంగా ఎదురయ్యే ఇబ్బందుల గురించి మాట్లాడటం వింతగా ఉంది అంటూ కొందరు వాదిస్తున్నారు.