Begin typing your search above and press return to search.

యాప్‌కాలం : తెగదెంపులకూ ఓ యాప్‌

By:  Tupaki Desk   |   25 Nov 2017 1:35 PM GMT
యాప్‌కాలం : తెగదెంపులకూ ఓ యాప్‌
X
కలిసి జీవించాలనుకొని ప్రారంభించిన ప్రయాణం మధ్యలో ఆగిపోతుంది. ఆ బంధాన్ని నిలబెట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. చివరకు కోర్టు తలుపుతట్టడమే మిగులుతుంది. ఇలా నిత్యం కొన్ని వందల జంటలు కోర్టు మెట్లెక్కుతున్నాయి. కానీ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియకపోవడం వల్ల - న్యాయపరంగా తమకు ఎలాంటి హక్కులు ఉన్నాయో వాటిని ఎలా దక్కించుకోవాలో తెలియకపోవడం వల్ల చాలా మంది ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా ముందుకు వచ్చిందే ‘డైవర్స్‌ కార్ట్‌’ మొబైల్‌ యాప్‌.

ప్రముఖ న్యాయవాది - రచయిత్రి వందనా షా న్యాయ సలహాల కోసం ‘లీగల్‌ యాప్‌’తో ముందుకు వచ్చింది. ప్రధానంగా విడాకులు కోరుకునే వారికోసం ఇలాంటి మొబైల్‌ యాప్‌ని ప్రవేశపెట్టడం దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం.‘డైవర్స్‌ కార్ట్‌’ మొబైల్‌ యాప్‌ కేవలం లీగల్‌ రైట్స్‌ గురించి అవగాహనకోసం ఉద్దేశించింది మాత్రమే. వివాహబంధాన్ని తుంచివేయడానికి కాదని గమనించాలి. యాప్‌ ద్వారా సలహాలు అడిగే వారికి వందన తగిన సూచనలు చేస్తుంది. విడాకుల విషయంలో అవసరమైన న్యాయ సలహాలను అప్పటికప్పుడు అందించడం ఈ యాప్‌ ప్రత్యేకత. 24 గంటలూ ఈ సేవల్ని వినియోగించుకోవచ్చు. ఈ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకున్న వారికి కోర్టు నిబంధనలను సైతం తెలియజేస్తుంది. వినియోగదారులు పంచుకునే విషయాలేవీ ఇతరులకు తెలిసే అవకాశం ఉండదు. ఉచితంగా న్యాయపరమైన సలహాలు తీసుకునే అవకాశం ఉండడం వల్ల మానసిక ఆందోళన - ఆర్థిక దుబారా భారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ యాప్‌ని గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

- నగరాల్లో పదేళ్ల క్రితం వెయ్యి వివాహాల్లో ఒక్కటి విడాకుల వరకు వెళ్లేది. కానీ ఇప్పుడు ప్రతి వెయ్యి వివాహాల్లో 13 జంటలు విడాకుల వరకు వెళ్తున్నాయి. దశాబ్ధ కాలంలో 13 శాతం విడాకులకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది.

- తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ - కర్ణాటక - మహారాష్ట్ర - జార్ఖండ్‌ - ఒడిషా - చత్తీస్‌ఘడ్‌ - గుజరా - తమిళనాడు - హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని నగరాల కంటే గ్రామాల్లో విడాకులు శాతం అధికంగా కనిపిస్తోంది.

- ఢిల్లీ - బెంగాల్‌ - పంజాబ్‌ - బీహార్‌ - రాజస్తాన్‌ - అస్సాం - ఉత్తర ప్రదేశ్‌ - ఉత్తరాఖండ్‌ - జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాల్లో గ్రామాల కంటే నగరాల్లో విడుకుల శాతం అధికంగా కనిపిస్తోంది