Begin typing your search above and press return to search.

పెళ్లి పెటాకులు.. తెలంగాణలోనే ఎక్కువ

By:  Tupaki Desk   |   24 Feb 2020 3:30 PM GMT
పెళ్లి పెటాకులు.. తెలంగాణలోనే ఎక్కువ
X
మూడు ముళ్లతో ఒక్కటైన జంటలు మూన్నాళ్లు కూడా ముచ్చటగా కాపురం చేయడం లేదు. ఉరుకులపరుగుల జీవితం.. ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ బిజీగా గడపడం.. కలిసి జీవిస్తున్నా.. ప్రేమాప్యాయతలు కరువై.. వివాదాలు మొదలవుతున్నాయి. ఇద్దరు సంపాదన చేస్తూ తమ సంసారాన్ని పక్కనబెట్టేశారు. ఏదో ఇద్దరు వస్తారు.. వెళ్తారు.. వారి మధ్య మనసు విప్పి మాట్లాడుకునే సమయం కూడా ఉండడం లేదు. దీంతో వారి మధ్య కలహాలు మొదలై అవి వారి మధ్య దూరం పెంచుతున్నాయి. దీంతో చివరకు విడాకులు తీసుకునే పరిస్థితికి వస్తోంది. అయితే ఈ విధంగా విడాకులు తీసుకుంటున్న సంఖ్య తెలంగాణలో ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

అయితే ఈ విడాకుల కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయని.. ఇప్పటికే ఆ కేసులు ఏకంగా 6 వేలకు పైగా ఉన్నాయని తెలిపారు. ప్రతియేటా 20శాతం విడాకుల కేసులు పెరుగుతున్నాయని పోలీస్ రికార్డులు - కోర్టు రికార్డులు చెబుతున్నాయి. అయితే విడాకులు కోరుతున్న వారిలో పెళ్లయిన ఐదేళ్లలోపు వారే ఎక్కువగా ఉండడం గమనార్హం. అయితే హైదరాబాద్ కోర్టులో ప్రస్తుతం 1,800 కేసులు పెండింగ్ లో ఉండగా వాటిలో వెయ్యి కేసులు విడాకులే ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయి.

అయితే విడాకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన రేకెత్తుతోంది. పెళ్లి చేసిన ఐదేళ్లలోపు దంపతులు విడాకులు కోరుతుండడానికి కారణాలు అన్వేషిస్తున్నారు. అర్థం చేసుకోకపోవడం.. ఇద్దరి మధ్య సన్నిహిత్యం ఏర్పడకపోవడం.. ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు ఏర్పడడం వాటిని చర్చించుకుని పరిష్కరించుకునే సమయం కూడా ఉండకపోవడం అవి చిన్న చిన్న గొడవలు కాస్త పెరిగిపోయి చివరకు వారిద్దరూ విడిపోయే వరకు దారి తీస్తున్నాయి.