Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ :విడాకుల కోసం కొత్త జంటల పాట్లు..ఎందుకంటే?

By:  Tupaki Desk   |   16 March 2020 11:30 PM GMT
కరోనా ఎఫెక్ట్ :విడాకుల కోసం కొత్త జంటల పాట్లు..ఎందుకంటే?
X
కరోనా ..కరోనా ..కరోనా ...అదేదో కరీనా అనుకుంటే పొరపాటే. కరీనా కపూర్ కాదు ..కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ ని తలచుకున్నని సార్లు - ఎదో ఒక దేవున్ని తలచుకున్నా ఈపాటికి కోరుకున్న వరం ఎదో ఇచ్చేవాడు. కానీ , ఈ కరోనా మాత్రం - తగ్గిపోవడం పక్కన పెడితే - ఇంకా వేగంగా విస్తరిస్తుంది. చైనాలోని వూహన్ సిటీలో బయటపడ్డ ఈ కరోనా వైరస్ ..ఆ తరువాత అక్కడి నుండి ఒక్కో దేశానికీ విస్తరిస్తూ - దాదాపుగా ప్రపంచంలోని 140 దేశాలకి విస్తరించింది. ఇక ఆ కరోనా భారత్ లోకి కూడా వచ్చిన విషయం తెలిసిందే. భారత్ లో ఇప్పటివరకు ..110 మందికి కరోనా పాజిటివ్ గా వచ్చింది. ఇక, ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి సుమారు 6000 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక ఈ కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచ దేశాలు - తమ తమ దేశాలలో అన్ని రంగాలకి సెలవులు ప్రకటించింది. ఇదే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన జంటలకు శాపంగా మారింది. అసలు కరోనా వల్ల కొత్త జంటలకు ఏంటి సమస్య అని ,అసలు కరోనా వైరస్‌‌ కు - వాళ్లకు లింకేంటి అని అనుకుంటున్నారా.? అసలు విషయం ఏంటంటే ...తాజా సమాచారం ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి చూసుకుంటే చైనాలో ఒకే ఆఫీసులో పని చేస్తున్న 300 జంటలు విడాకులకు అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా అన్ని దేశాలు స్కూళ్లు - విద్యాసంస్థలు - ఆఫీసులు అన్నింటినీ బంద్ చేసి జనాలను గృహ నిర్బంధం చేశారు. దీనితో కొత్తగా పెళ్ళైన జంటలు ఇళ్ల దగ్గర ఎక్కువగా సమయం గడుపుతున్నారు. దీనితో వారు తరచూ గొడవలకు దిగుతున్నారు.

ఈ క్రమంలోనే వందలాది జంటలు తమ బంధానికి ఫుల్‌ స్టాప్ చెప్పాలని భావిస్తున్నారు. ఇప్పటికే చాలామంది అపాయింట్‌ మెంట్లను సైతం తీసుకున్నట్లు డజహౌకు చెందిన మ్యారేజ్ రెజిస్టరీ మేనేజర్ లూ షిజున్ స్పష్టం చేశాడు. యువ జంటలు ఎక్కువసేపు ఇళ్ల దగ్గర గడుపుతున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవలు జరగడం - పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ జరగడం వల్ల - వాళ్ల వ్యవహారం విడాకుల వరకు వెళ్తోందని ఆయన అన్నారు. అయితే , విడాకుల కేసులు ఎక్కువ కావడానికి మరో కారణం కూడా ఉందని అయన అభిప్రాయపడుతున్నారు. కరోనా భయంతో సంస్థలు కొద్దిరోజులుగా మూసేసి ఉండటంతో అప్లికేషన్స్ వెల్లువ పెరిగి ఉండవచ్చునని లూ షిజున్ అభిప్రాయపడుతున్నారు. ఒక్క డజహౌ నగరంలోనే కాదు.. చైనాలోని పలు సిటీస్‌ లో విడాకుల కేసులు ఎక్కువగా నమోదు అయినట్లు తెలుస్తోంది.