Begin typing your search above and press return to search.
‘నా భార్యతో విడాకులు ఇప్పించండి.. లేకపోతే చంపేస్తుంది’
By: Tupaki Desk | 2 Sep 2021 11:30 PM GMTజాలీ అమ్మా జోసెఫ్ గుర్తున్నారా? చూసినంతనే ఆకర్షణీయమైన రూపంతో కట్టిపడేసే ఆమెకు సంబంధించి నిజం తెలిసిన వారంతా చిగురుటాకులా వణికిపోయారు. మగమహారాజులు అన్న వారు ఆమె నీడ పడటానికి కూడా ఇష్టపడని పరిస్థితి. ఆమె రూపానికి.. ఆమె మైండ్ సెట్ కు ఏ మాత్రం సెట్ కాకపోవటమే కాదు.. రెండేళ్ల క్రితం ఆమె దేశ వ్యాప్తంగా ఓవర్ నైట్ వార్తాంశంగా మారారు. దీనికి కాడు ఆమె చేసిన హత్యలే. కేరళ సైనైడ్ మర్డర్ల పేరుతో.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ జాలీ మరోసారి వార్తల్లోకి వచ్చారు.
తాజాగా ఆమె రెండో భర్త ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు. తనకు వెంటనే విడాకులు ఇప్పించాలని.. తన భార్యతో ఒక్క క్షణం కూడా ఉండలేనని.. ఆమె కానీ జైలు నుంచి వస్తే తనను చంపేస్తుందని వణుకుతున్నాడు. తన మొదటి భర్తతో పాటు వారి ఇంట్లో ఆరుగురిని సైనేడ్ ఇచ్చి చంపేసి.. మృత్యు దేవతగా మారిన ఆమె దారుణాలు బయటకు రావటం తెలిసిందే. తాను హత్యలు చేసిన మాట వాస్తవమే అంటూ ఆమె నిజాల్ని ఒప్పుకోవటం తెలిసిందే. తర్వాత ఆమెకు సంబంధించిన వార్తలు పెద్దగా బయటకు రాలేదు.
తాజాగా ఆమె రెండో భర్త.. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించటంతో ఆమె ఉదంతం మరోసారి తెరమీదకు వచ్చింది. ఆమెను పెళ్లి చేసుకున్న రెండో భర్త షాజూ జకారియా మాట్లాడుతూ.. ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు తనకు ఈ హత్యల గురించి అస్సలు తెలీదన్నారు. వరుస మరణాలపై దర్యాప్తు మొదలైన తర్వాతే.. తన భార్య దారుణ మైండ్ సెట్ తెలిసిందని.. ఆమె బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆమెతో తాను కలిసి ఉండాల్సి వస్తే.. అది తన ప్రాణాలకు ప్రమాదమని ఆయన వాపోతున్నాడు. 2002లో తన అత్తగారికి అన్నంలో విషం పెట్టి చంపేసిన జాలీ.. ఆ తర్వాత నుంచి వరుస పెట్టి తన కుటుంబ సభ్యుల్ని చంపేయటం తెలిసిందే. చివరకు తన భర్తను సైతం 2011లో చంపేసింది.
అయితే.. అప్పటికే అతగాడికి ఆర్థిక సమస్యలు ఉండటంతో.. ఆత్మహత్య చేసుకున్నాడని భావించారు. అయితే.. అతని సోదరుడు అనుమానంతో పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటం.. పోలీసులకు జాలీ ప్రవర్తనలో తేడా అనిపించి.. తీగ లాగటంతో ఆమె చేసిన హత్యల పరంపర బయటకు వచ్చి దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు. అయితే.. ఆమె ఈ హత్యలన్నింటిని ఎందుకు చేశారు? ఎలా చేశారు? దానికి కారణం ఏమిటన్న ప్రశ్నలకు సమాధానాలు సగమే వచ్చాయి.
బంగారం పనికి ఉపయోగించే సైనేడ్ ను ఎలుకల్ని చంపటానికి అంటూ కొనే ఆమె.. దాన్ని ఆహారంలో కలిపి వడ్డించి.. ప్రాణాలు తీస్తుందని గుర్తించారు. తానో ఉన్నత ఉద్యోగిని అంటూ బిల్డప్ ఇచ్చే ఆమెకు ఎలాంటి ఉద్యోగం లేదన్న విషయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. ఏళ్లకు ఏల్లు మరి పొద్దున్నే బయటకు వెళ్లే ఆమె ఏం చేసేదన్న దానిపై ఇప్పటికి మిస్టరీ వీడలేదని చెబుతారు. మరి.. ఆమె రెండో భర్త కోరుకున్నట్లుగా తక్షణం విడాకుల్ని కోర్టు ఎప్పటికి ఇస్తుందో చూడాలి.