Begin typing your search above and press return to search.

భర్తతో విడాకులు .. ప్రియుడుతో రాసలీలలు .. పరువుహత్య - కోట్లు ఉంటే ఏం లాభం!

By:  Tupaki Desk   |   6 Jan 2021 12:30 AM GMT
భర్తతో విడాకులు .. ప్రియుడుతో రాసలీలలు .. పరువుహత్య - కోట్లు ఉంటే ఏం లాభం!
X
కట్టుకున్న భర్తతో విడాకులు తీసుకున్న శ్రీమంతుల కుటుంభానికి చెందిన ఓ మహిళ ఇంట్లో తెలీకుండా ప్రియుడితో ఏకంగా ఓ ఇంట్లో కాపురం పెట్టింది. తమ సోదరి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం సాగిస్తున్న విషయం తెలుసుకున్న ఆమె సోదరులు, కుటుంబ సభ్యులు సహనం కోల్పోయారు. పద్దతి మార్చుకోవాలని ఆమెకు చెప్పినా వినడం లేదని కక్షపెంచుకున్నారు. వందల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా మనకు పరువు మర్యాద మంటకలిసిపోతోందని సహనం కోల్పోయిన సొంత సోదరులు ఆమెను అతి దారుణంగా చంపేశారు. కిరాయి హంతకులతో కలిసి హత్య చేసిన ఇద్దరు సోదరులు చివరికి సాక్షాలు చిక్కకుండా నాశనం చేసి అప్పుడు కటకాటాల పాలై ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చారు. కేసు నుంచి విముక్తి పొందాలని ప్రయత్నిస్తున్న సోదరులు ఇప్పుడు ఆస్తుల కోసం వాళ్ల కుటుంబ సభ్యుల మీద వాళ్లే మళ్లీ పగ పెంచుకోవడం కలకలం రేపింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. గుజరాత్ లోని రాజ్ కోట్ లో బిసువాలా అనే శ్రీమంతుడు నివాసం ఉంటున్నాడు. ఇతను రాజ్ కోట్ లో పేరుమోసిన వ్యాపారవేత్త. ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఈయనకు బిరేన్ వాలా, రిజ్విర్ అనే ఇద్దరు కుమారులతో పాటు పూనమ్ వాల అనే కుమార్తె ఉంది. రాజ్ కోట్ వ్యాపారి బిసువాల తన కుమార్తె వాలకు ముంబైలో శ్రీమంతుల కుటుంబంలో ఓ పెళ్లి సంబంధం చూసి 9 సంవత్సరాల క్రితం వివాహం చేశాడు. గత 9 సంవత్సరాల క్రితం పూనమ్ ముంబైలో భర్తతో కలిసి కాపురం ఉండేది. బిసువాల, ఆయన ఇద్దరు కుమారులు అప్పుడప్పుడు ముంబై వెళ్లి పూనమ్ ను చూసి వచ్చేవారు. కుటుంబ సమస్యలు ఉన్నాయంటూ 2017లో పూనమ్ చట్టపరంగా తన భర్తతో విడాకులు తీసుకుంది.

ముంబై నుంచి రాజ్ కోట్ చేరుకుని తల్లిదండ్రుల ఇంటిలోనే నివాసం ఉంటున్నది. శ్రీమంతులు కావడంతో పూనమ్ కు ప్రత్యేకంగా కారు తీసిచ్చారు. పూనమ్ చూడటానికి సినిమా హీరోయిన్ కంటే చాలా అందంగా ఉంటుంది. ఇక పుట్టినప్పటి నుంచి డబ్బులో పెరిగిన పూనమ్ భర్తతో విడాకులు తీసుకున్న తరువాత లెక్కలేనంత డబ్బులు ఖర్చు పెడుతూ పిచ్చపాటిగా ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. ప్రతి రోజు పూనమ్ ఇంటి నుంచి కారులో బయటకు వెలుతోంది. పూనమ్ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. రాజ్ కోట్ లోనే తల్లిదండ్రులు, సోదరులకు తెలీకుండా ఆమె ప్రియుడితో కలిసి ప్రత్యేకంగా ఇంటిని తీసుకుని ప్రతి రోజు పగలు అక్కడే గడపడం మొదలుపెట్టింది. రాత్రి అయ్యే సరికి ఆమె ఇంటికి చేరుకునేదని సమాచారం. డ్రైవర్ ను వెంట తీసుకుని వెళ్లాలని చెప్పినా పూనమ్ మాత్రం ఆమె డ్రైవింగ్ చేసుకుంటూ బయటకు వెళ్లేది. పూనమ్ తన స్నేహితులను కలవడానికి వెలుతోందని కుటుంబసభ్యులు అనుకున్నారు. పూనమ్ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం సాగిస్తోందని ఆమె సోదరులు బిరెన్ వాలా, రాజ్విర్ లకు తెలిసింది. అక్రమ సంబంధం కోసమే తమ సోదరి పూనమ్ అనసరంగా భర్తకు విడాకులు ఇచ్చిందని కక్ష పెంచుకున్నారు. జస్ధాన్ రఘు జిదా, గౌతమ్ వాలా, మహేష్ అనే ముగ్గురితో కలిసి పూనమ్ ను హత్య చెయ్యాలని ప్లాన్ వేశారు.

జస్ధాన్ గ్రామంలోని తమ ఫామ్ హౌస్ లోకి తీసుకెళ్లారు. ఇద్దరు సోదరులు మరో ముగ్గురితో కలిసి పూనమ్ తో బలవంతంగా విషం తాగించారు. ఐదు మంది కలిసి పూనమ్ కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకోవడంతో శరీరం మొత్తం విషయం వ్యాపించి ఆమె అక్కడికక్కడే మరణించింది. పూనమ్ అంత్యక్రియలు కూడా అదే ఫాం హౌస్ లో పూర్తి చేసి పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కకుండా సాక్షాలు పూర్తిగా నాశనం చేశారు. చాలాకాలం తరువాత పూనమ్ కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు డీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్ కోట్ పోలీసులకు అనుమానం వచ్చి పూనమ్ సోదరులు బిరెన్ వాలా, రిజ్విర్ లను విచారించారు. వారు పొంతనలేని సమాదానం ఇవ్వడంతో డీసీబీ సీనియర్ అధికారి హెచ్ఎం. గాద్వీ రంగంలోకి దిగారు. పూనమ్ చూడటానికి సినిమా హీరోయిన్ లాగా ఉంటుంది. పూనమ్ మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకే తాము పరువు హత్య చేశామని ఆమె సోదరులు బిరెన్ వాలా, రిజ్వర్ అంగీకరించారని అప్పట్లో డీసీబీ పోలీసు అధికారి హెచ్ ఎం. గాధ్వీ మీడియాకు చెప్పారు. కొంతకాలం జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చిన సొంత సోదరులు సంతోషంగానే కలిసి ఉన్నారు. ఇప్పుడు ఆస్తి పంపకాల కోసం సోదరుల కుటుంబ సభ్యులు మళ్లీ ఒకరి మీద ఒకరు పగ పెంచుకోవడంతో వారి ఇంటి కథ మళ్లీ మొదటికి వచ్చింది.