Begin typing your search above and press return to search.
ప్రెస్ మీట్ లో దివ్య వాణి ఏడ్చింది ఇందుకేనా?
By: Tupaki Desk | 2 Jun 2022 8:39 AM GMTటీడీపీకి రాజినామా చేసిన ప్రముఖ నటి దివ్యవాణి.. తెలుగుదేశం పార్టీపై తీవ్ర వ్యాఖ‍్యలు చేశారు. ఈ మేరకు దివ్యవాణి విజయవాడలో గురువారం మీడియాతో మాట్లాడారు. ఓ దశలో తనకు జరిగిన అన్యాయంపై ఉద్వేగానికిలోనై కన్నీరు పెట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ తనను టిడిపిలో చేర్చారని దివ్య వాణి తెలిపారు. తననే కూరలో కరివేపాకులా వాడుకుని వదిలేశారని.. నువ్వు ఎందుకు వస్తున్నావ్ తల్లి టీడీపీలోకి వస్తున్నావని ఆయన తనను అడిగారని గుర్తు చేసుకున్నారు. ఆయన అన్నట్టే తనను టిడిపిలో వాడుకుని వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీలో గతేడాది కాలంగా తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదన్నారు. కొందరు మహిళా నేతలు తనకు ఫోన్ చేసి తిట్టారని తెలిపారు. కొందరు బుద్ధిలేని వారు బుద్ధిలేకుండా మాట్లాడుతున్నారనీ మండిపడ్డారు.
చంద్రబాబుని కలిశాక ప్యాకేజీ అందింది.. అందుకే రాజీనామా చేయట్లేదని అంటున్నారని నిప్పులు చెరిగారు. తాను ఎవరికీ ఎప్పుడూ భజన చేయలేదనీ.. చేయనని స్పష్టం చేశారు. పార్టీలో ఏం జరుగుతుందో ఉన్నది ఉన్నట్టు చెప్పానన్నారు. సమస్యను లోకేశ్ దృష్టికి తీసుకెళితే.. జనార్ధన్‌కు చెప్పమన్నారని వివరించారు.
కొందరు ఇడియట్స్ జర్నలిజం పేరుతో నానా మాటలు అన్నారని దివ్యవాణి మండి పడ్డారు. చివరి నిమిషం వరకు స్పష్టత తీసుకునేందుకే రాజీనామా విషయంలో ఆగానన్నారు. టిడిపిలో ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ భావించలేదు అన్నారు.
చంద్రబాబు నాయుడికి మనస్సాక్షి ఉంటే గుండెపై చేయి వేసుకుని చెప్పాలనీ.. తాను చెప్పాల్సిన పాయింట్లను వేరే వాళ్లతో చెప్పించారని ద్వజమెత్తారు. టీడీ జనార్దన్ అనే వ్యక్తిని ప్రశ్నించినందుకు నరకం చూపిస్తారా..? పార్టీలో తన స్థానం ఏంటో తెలియని పరిస్థితి ఉంది కాబట్టే రాజీనామా చేశా అని కన్నీటిపర్యంతమయ్యారు.
మరోవైపు వైఎస్సార్ సీపీ నుంచి దివ్య వాణికి ప్యాకేజ్ అందిందని.. అందుకోసమే ఆమె ఇలా ప్లేట్ ఫిరాయించిందని టిడిపి నేతలు మండిపడుతున్నారు. వైఎస్సార్ సీపీ స్క్రిప్ట్ ప్రకారమే దివ్య వాణి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహానాడు సక్సెస్ తట్టుకోలేక జగన్ పార్టీ దివ్య వాణి రూపంలో డ్రామాలు ఆడుతోందని ధ్వజమెత్తారు.