Begin typing your search above and press return to search.
అనంతలో ఫ్లెక్సీ రచ్చ... 144 సెక్షన్!
By: Tupaki Desk | 27 Oct 2016 6:53 AM GMTఈమధ్య కాలంలో పార్టీలకతీతంగా ఫ్లెక్సీల గొడవా మరీ పెరిగిపోతుంది. తమ ఫ్లెక్సీ ఎదుట ప్రత్యర్ధులు ఫ్లెక్సీలు పెట్టారని నిన్నమొన్నటివరకూ ఒక రచ్చ జరిగింది. బీజేపీ మంత్రికి - వైకాపా నేతలకు మధ్య జరిగిన ఆ రచ్చ అంతా ఇంతా కాదు. అయితే తాజాగా మరోసారి అనంతలో ఫ్లెక్సీ విషయం పెద్ద రచ్చే చేసింది. అయితే ఈ సారి ఈ వివాదంలో ఉన్నది టీడీపీ మంత్రి - టీడీపీ ఎమ్మెల్యే కావడం గమనార్హం. దీంతో అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీత - ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయుల మధ్య నిపురుగప్పిన నిప్పులా విభేదాలు ఉన్నాయనే విషయం కాస్తా రచ్చకెక్కింది!
విషయానికొస్తే... మిగిలిన సంగతులు ఎలా ఉన్నా ఏదైనా పండగ వస్తుందంటే నాయకులంతా ముందుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేసి ప్రజలకు శుభాకాంక్షలు చెబుతుంటారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా బత్తలపురం మండలం ఘంటాపురం గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు జగ్గు - ధర్మవరం పట్టణంలో దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో జిల్లా మంత్రి పరిటాల సునీత - ఆమె తనయుడు శ్రీరామ్ ఫోటోను ఏర్పాటు చేశారు. అంతవరకూ బాగానే ఉంది కానీ... స్థానిక ఎమ్మెల్యే వరదాపురం సూరి ఫోటో మాత్రం వేయలేదు. దీంతో స్థానిక ఎమ్మెల్యే అయిన తమ నాయకుడి ఫోటో లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తారా అంటూ సూరి వర్గీయులు ఫైరయ్యారు. జగ్గు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించేందుకు వారంతా ప్రయత్నించారు.. దీంతో ఈ వివాదం మొదలైంది.
ఇలా జగ్గు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించేందుకు సూరి వర్గీయులు చేసిన ప్రయత్నాన్ని పరిటాల సునీత వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాలు ముందు వాగ్వాదం, తర్వాత బాహాబాహీకి దిగడం జరిగిపోయాయి. అనంతరం సూరి వర్గీయులు ఫ్లెక్సీని కొంత చింపారు. దీంతో ఫ్లెక్సీ వద్దే సునీత వర్గీయులు బైఠాయించడం జరిగింది. ఈ స్థాయిలో పరిస్థితులు వెళ్లిపోవడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకుగాను పట్టణంలో 144 సెక్షన్ ను విధించిన పోలీసులు, ఆ ఫ్లెక్సీకి కాపలా ఏర్పాటుచేశారు!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/