Begin typing your search above and press return to search.
కోదాడలో పెళ్లిలో DJ చిచ్చు... వరుడిని బాదిన వధువు బంధువులు
By: Tupaki Desk | 4 Nov 2019 10:32 AM GMTపెళ్లిలో డీజే రేపిన వివాదం చినికి చినికి గాలివానలా మారడంతో పెళ్లి పందిరి కాస్తా రణరంగ క్షేత్రాన్ని తలపించింది. చివరకు పెళ్లి కొడుకు తరపు వారు, పెళ్లి కూతురు తరపు వారు చితక్కొట్టుకున్నారు. పెళ్లి కొడుకు ఓవర్ యాక్షన్‌తో పెళ్లికూతురు తరపున బంధువుల అతడిని కూడా వీరబాదుడు బాదారు. ఎవరికి వారు చేతిలో ఏం ఉంటే దానిని విసిరేసుకున్నారు. కుర్చీలు, బిందెలు, కర్రలు, రాళ్లతో కొట్టుకోవడంతో చాలా మందికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని తొగర్రాయిలో జరిగింది.
తొగర్రాయి గ్రామానికి చెందిన అజయ్‌కు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన ఇంద్రజతో పెళ్లి కుదిరింది. ఈ పెళ్లి వేడుక ఇరువురి తరపున బంధువుల సమక్షంలో వైభవంగా జరిగింది. భోజనాలు అయ్యాయి. సాయంత్రం వరుడితో పాటు అందరూ వధువు ఇంటికి వెళ్లేందుకు బయలు దేరుతున్నారు. ఈ టైంలో ఊరిలో ఊరేగింపు కోసం డీజే ఏర్పాటు చేశారు. ఓ వైపు డీజే వాయింపులతో పాటు అందరూ డ్యాన్సులు చేస్తూ వధూవరులను ఎర్రగొండపాలెం సాగనంపుతున్నారు.
ఈ టైంలో డీజేను ఆపాలని స్థానికంగా ఉన్న కొందరు యువకులు కోరారు. అయితే అమ్మాయి తరపు వారు మాత్రం తమకు ఆలస్యం అవుతోందని... తాము వెంటనే వెళ్లాలని చెప్పారు. ఈ క్రమంలోనే అక్కడ స్థానికులకు పెళ్లికుమార్తె తరపు వారికి మధ్య చిన్న వివాదం చెలరేగి అది కాస్తా పెద్దది అయ్యింది. ఈ క్రమంలో పెళ్లికొడుకు, పెళ్లి కూతురు తరపు బంధువుల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది.
సహనం కోల్పోయిన పెళ్లికొడుకు అజయ్ పెళ్లికుమార్తె తరపు బంధువులపై చేయి చేసుకోవడంతో మొదలైన ఘర్షణ చిన్నపాటి యుద్ధ వాతావరణాన్ని తలపించింది. చివరకు అమ్మాయి తరపు వారు అందరూ ఒక్కసారిగా వచ్చి పెళ్లి కొడుకును చితకబాదారు. అయితే స్థానికులు కూడా వచ్చి అమ్మాయి తరపు బంధువులను ఇష్టమొచ్చినట్టు కొట్టారు. చివరకు ఎవరు చేతికి ఏది దొరికితే దానిని విసిరేశారు. కుర్చీలు గాల్లోకి ఎగిరాయి. తలలు పగిలాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఏదేమైనా పెళ్లి ఇళ్లు కాస్తా యుద్ధవేదికగా మారిపోయింది.