Begin typing your search above and press return to search.
ఫ్రెంచ్ ఓపెన్ థ్రిల్లర్ః రాకెట్ తో రఫ్పాడించిన జకోవిచ్
By: Tupaki Desk | 14 Jun 2021 6:39 AM GMTఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ ఫైనల్స్ లో వరల్డ్ నెంబర్ వన్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ మరోసారి రఫ్పాడించాడు. నరాలు తెగే ఉత్కంఠగా సాగిన తుది పోరులో.. ప్రత్యర్థి సిట్సిపాస్ బలమైన పోటీని ఇచ్చాడు. మొత్తం ఐదు సెట్ల ఫైనల్స్ లో.. రెండు సెట్లు సొంతం చేసుకొని సిట్సిపాస్ సత్తా చాటగా.. తన అనుభవాన్ని, అద్దరిపోయే ఆటను ప్రదర్శించి మిగిలిన మూడు సెట్లలో సింహనాదం చేశాడు జకోవిచ్. ఆ విధంగా.. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను సగర్వంగా కిస్ చేశాడు.
నిజానికి ఫ్రెంచ్ ఓపెన్ లో.. సిట్సిపాస్ చరిత్ర సృష్టిస్తాడనే అనుకున్నారు అందరూ. మొదటి, రెండు సెట్లను సిట్సిపాస్ గెలవడంతో.. మూడో విజయం కూడా లాంఛనమే కావొచ్చని అంచనా వేశారు. టైటిల్ అతడే గెలుస్తాడని చాలా మంది భావించారు. కానీ.. జకోవిచ్ తనదైన ఆటతీరును మూడో సెట్ నుంచి మొదలు పెట్టాడు. ప్రత్యర్థి సిట్సిపాస్ కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడుగా దూసుకెళ్లాడు.
మొదటి రెండు సెట్లను (7-6), (6-2) తేడాతో సిట్సిపాస్ గెలుచుకోగా.. మిగిలిన మూడు సెట్లను జోకోవిచ్ వరుసగా (6-3), (6-2), (6-4) తేడాతో సొంతం చేసుకున్నాడు. ఆ విధంగా ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ ను అందుకున్నాడు.
ఈ విజయంతో.. జొకోవిచ్ రెండవ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. అదేవిధంగా.. 19 వ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను దక్కించుకున్న వాడయ్యాడు. ఈ గెలుపుతో.. టెన్నిస్ చరిత్రలోనే కెరీర్ గ్రాండ్ స్లామ్‌ను రెండుసార్లు పూర్తి చేసిన మూడవ వ్యక్తిగా నిలిచాడు సెర్బియా స్టార్.