Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు సరైన ప్రత్యర్థిని రెడీ చేస్తున్నారు
By: Tupaki Desk | 17 Jun 2016 3:09 PM GMTతెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకురాలిగా డీకే అరుణను నియమించడానికి రంగం సిద్ధమవుతోందా?రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ ముందు ఈ మేరకు ప్రతిపాదించారా? దానికి నొచ్చుకున్న జానారెడ్డి పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధమని ప్రకటించారా? అంటే అవుననే ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార టీఆర్ ఎస్ పార్టీలో కొనసాగుతున్న వలసలను నిలువరించి పార్టీ పటిష్టత కోసం చర్యలు తీసుకునేందుకు సమావేశమైన సమావేశంలోను అగ్రనేతల మధ్య విభేదాలు బయట పడ్డాయి. సీఎల్పీ నేతగా జానారెడ్డి స్థానంలో డీకే అరుణను నియమించాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ప్రతిపాదించారని సమాచారం. పాల్వాయి ప్రతిపాదనపై జానారెడ్డి తీవ్రంగా నొచ్చుకుని, సీఎల్పీనేతగా ఎవరికి అవకాశం కల్పించిన తనకు అభ్యంతరం లేదని, తాను సాధారణ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని అన్నట్లు సమాచారం. అయితే సీనియర్లు ఆయన్ని సముదాయించి, అస్త్ర సన్యాసానికిది సమయం కాదని బుజ్జగించారు. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి - మిర్యాలగూడెం ఎమ్మెల్యే భాస్కర్ రావు లు కాంగ్రెస్ వీడి టిఆరెస్ లో చేరాలని నిర్ణయించుకున్న వెంటనే తీవ్ర మనస్తాపానికి గురయిన జానారెడ్డి తనకు ఏ పదవులు వద్దని, తాను సీఎల్పీ పదవి వదులుకోవడానికి కూడా సిద్ధమేనని బాహాటంగానే ప్రకటించారు. జానారెడ్డిని ఉద్దేశించి టీఆర్ ఎస్ కోవర్టు అంటూ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జానారెడ్డిపై పాల్వాయి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన క్రమశిక్షణ సంఘం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన్ని మరొకసారి ఇబ్బంది పెట్టేందుకే పాల్వాయి - సీఎల్పీ నేతలను మార్చలన్న డిమాండ్ తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.
ప్రభుత్వం పై అసెంబ్లీ లో బయట గట్టిగా పోరాడుతున్న డీకే అరుణను సీఎల్పీ నేతగా నియమించాలన్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ప్రతిపాదనకు పార్టీలోని ఒకవర్గం మద్దతు తెలియజేస్తోంది. అధికార పార్టీ పట్ల జానారెడ్డి మెతక వైఖరి వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్న విమర్శలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు సీఎల్పీనేతను మార్చాలన్న ప్రతిపాదన సరైందేనంటున్నారు. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలో బలమైన నేతగా ఉన్న డీకే అరుణను తమ వైపు తిప్పుకోవాలని అధికార టీఆర్ఎస్ నాయకత్వం తీవ్ర ప్రయత్నాలే చేసింది. అయినా ఆమె కాంగ్రెస్ ను వీడేది లేదని విస్పష్టం చేశారు. ప్రభుత్వం పై అసెంబ్లీలో, బయట ఎదురుదాడి చేస్తోన్న డీకే అరుణ కుటుంబీకుల అధీనం ఉన్న భూములను అధికార పార్టీ ఒత్తిళ్లతో ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని వార్తలు వచ్చాయి. అయినా కూడా ప్రభుత్వంపై పోరాటంలో ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జానారెడ్డి స్థానంలో సీఎల్పీనేతగా డీకే అరుణను నియమించడం అనే అంశం తెరమీదకు వచ్చిందంటున్నారు.