Begin typing your search above and press return to search.
తెలంగాణ బీజేపీ అధ్యక్షులుగా డీకే అరుణ!
By: Tupaki Desk | 31 Oct 2019 8:30 AM GMTకిషన్ రెడ్డిని పరీక్షించారు.. తెలంగాణలో అధికారంలోకి రాలేదు. ఇక ఆ తర్వాత లక్ష్మణ్ ను ప్రయోగించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నారు. అయినా తెలంగాణలో బీజేపీ ఒకే ఒక్క సీటుకు పరిమితమై ఘోర ఓటమిని చవిచూసింది. పాత కాపులు, బీజేపీ నాయకుల వల్ల సాధ్యం కావడం లేదు.. దీంతో తెలంగాణలో బీజేపీ ఆశలు నెరవేరడం లేదు. మరిప్పుడు ఏం చేయాలి? అంటే ఫైర్ బ్రాండ్ గల నేతకు పగ్గాలివ్వాలి. కేంద్రంలో అధికారం సాయంతో బీజేపీని గద్దెనెక్కించాలి. ఇప్పుడు ఇదే టార్గెట్ తో తెలంగాణలో బీజేపీ పెద్దలు ముందుకు వెళుతున్నారని తెలుస్తోంది.
తెలంగాణలో బీజేపీ పరిస్థితి రోజురోజుకు తీసికట్టుగా మారిపోతోంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ హవా, స్థానిక ఎంపీ అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్ కారణంగా నాలుగు ఎంపీ సీట్లను బీజేపీ దక్కించుకోగలిగింది. అయితే తరువాత జరిగిన హుజూర్ నగర్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ బొక్కబోర్లా పడింది. కనీసం స్వతంత్ర్య అభ్యర్థికంటే తక్కువగా ఓట్లు తెచ్చుకొని డిపాజిట్ గల్లంతు చేసుకుంది. ఇప్పుడు వచ్చేసారి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళుతున్న బీజేపీకి ఈ పరిస్థితి శరాఘాతంగా మారింది. అందుకే పార్టీని నడిపించే నాయకుడు కావాలని యోచిస్తోందట..
ఇందులో భాగంగానే సొంతపార్టీ నేతలతో ప్రయోగాలు వికటించడంతో వలసవచ్చిన వారికి పగ్గాలు అప్పగించి చూడాలని బీజేపీ యోచిస్తోందట. ఈ క్రమంలోనే తెరపైకి డీకే అరుణ వచ్చారు. ఈ కాంగ్రెస్ మాజీ ఫైర్ బ్రాండ్ బీజేపీలోకి వచ్చాక మరింత దూకుడుగా కేసీఆర్ ను ఎదుర్కొంటున్నారు. ఆమె బలం - బలగం స్టామినా చూసి ఆమెకే తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పజెప్పబోతున్నారన్న ప్రచారం ఆ పార్టీలో సాగుతోంది. మరి డీకే అరుణతోనైనా బీజేపీ ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి మరీ..