Begin typing your search above and press return to search.
డీకే అరుణ అటా ఇటా..?
By: Tupaki Desk | 17 Feb 2016 7:42 AM GMTతెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్ డీకే అరుణపై వస్తున్న పుకార్లు కాంగ్రెస్ లో ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ అంతటా కాంగ్రెస్ కుప్పకూలితే మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం ఒక స్థానాన్ని ఆ పార్టీ సొంతం చేసుకుంది. ఇది డీకే అరుణ వల్ల మాత్రమే సాధ్యమైన విజయం. అంతేకాదు తెలంగాణలో టీఆర్ ఎస్ నేతలను ఎదుర్కొన్న ఏకైక కాంగ్రెస్ నేతగా కూడా డీకే అరుణ పేరు తెచ్చుకున్నారు. అలాంటి అరుణ కూడా గులాబీ గూటికి చేరుతారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే... ఆమె మాత్రం దాన్ని ఖండిస్తున్నారు.
డీకే అరుణపై ఇటీవల పెరిగిన ఒత్తిళ్ల నేపథ్యంలో ఆమె దూకుడు తగ్గిందని.... అవసరాల కోసం తప్పనిసరి పరిస్తితుల్లో కారెక్కేందుకు రెడీ అయ్యారని సమాచారం. డీకే కుటుంబం చేస్తున్న మైనింగ్ వ్యాపారం వివాదాస్పదమై కోట్లాది రూపాయల జరిమానా చెల్లించాల్సి రావడం, జూబ్లిహిల్స్ లో ఇటీవల డీకే అరుణ కుటుంబానికి చెందిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వంటివి పరిశీలిస్తే ఆమెపై బాగా ఒత్తిడి ఉందని అర్థమవుతోంది. జూబ్లీ హిల్స్ లోని ఆమె స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడమే కాకుండా అందులో రాత్రికి రాత్రి రోడ్డు కూడా వేశారు. అయితే.... గద్వాల జిల్లా సాధన కోసం ప్రాణమైనా ఇస్తానంటున్న ఆమె ఆ వదంతులను ఖండిస్తున్నారు.
డీకే అరుణ ఖండనతో కాంగ్రెస్ కొంత ఊరట చెందుతున్నా మొన్నమొన్న టీడీపీ నేతలు చేసిన ప్రకటనలు... ఆ సాయంత్రమే వెళ్లి టీఆరెస్ లో చేరడాలు చూస్తుంటే మాత్రం ఈ ఖండనలను ఎంతవరకు నమ్మొచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి.