Begin typing your search above and press return to search.
కవితకు బొమ్మాళి అదిరే కౌంటర్
By: Tupaki Desk | 4 Sep 2016 11:25 AM GMTతెలంగాణ పాలిటిక్స్ వెరైటీగా ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు కేసీఆర్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధాలు, సవాళ్లు - ప్రతిసవాళ్లు సాగితే.. ఇప్పుడు లేడీ పొలిటీషియన్ల మధ్య కామెంట్ల ఫైట్ సాగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ మాజీ మంత్రి - గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణను ఉద్దేశించి సీఎం కేసీఆర్ గారాల పట్టి, నిజామాబాద్ ఎంపీ కవిత చేసిన బొమ్మాళి ఆరోపణలు టీ పాలిటిక్స్ లో టాక్ ఆఫ్ ది కామెంట్స్ గా మారాయి. డీకే అరుణను బొమ్మాళిగా పోల్చిన కవిత.. గద్వాల్ లో రెస్ట్ తీసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. జిల్లా విభజనను చేపట్టిన కేసీఆర్ కు ఏ ప్రాంతాన్ని ఎలా జిల్లా చేయాలో ఆయనకు బాగా తెలుసని అన్నారు.
జగిత్యాల జిల్లాకు మధ్యలో ఉన్నందున జిల్లా కేంద్రం చేస్తున్నారని, గద్వాల ఒక మూల ఉందని ఈ కారణంగా దీనిని జిల్లా చేయడం కుదరదని కవిత స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్లు అరుణ మాట్లాడడం తగదని, ఆమె నోరుపారేసుకోకుండా గద్వాల కోటలో విశ్రాంతి తీసుకోవాలని కవిత సటైర్లు విసిరారు. ఇక, దీనికి కౌంటర్ గా అరుణ కూడా కవితను ఏకేశారు. ప్రస్తుతం గద్వాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. అరుణ దీక్ష చేపట్టారు.
ఆదివారం ఆమె మాట్లాడుతూ.. కవితపై కౌంటర్ వేశారు. మీ నాన్న(కేసీఆర్)నే ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకోమని సలహా ఇవ్వు అంటూ కవితపై ఫైరయ్యారు. గద్వాలలోని కోట తమది కాదని, రాజకీయాల్లో తాను ఏనాడూ రెస్ట్ తీసుకోలేదని అరుణ చెప్పుకొచ్చారు. గద్వాల కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాల్సిందేనని అరుణ మరోసారి డిమాండ్ చేశారు. ప్రతి పక్షాల సూచనలను - సలహాలను కూడా కేసీఆర్ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇలా, ఈ లేడీ పొలిటీషియన్ల మధ్య మాటల ఫైట్ వేడి పుట్టించింది. మరి అరుణకు కౌంటర్ గా కవిత ఇంకెలా స్పందిస్తారో చూడాలి.