Begin typing your search above and press return to search.
షర్మిలకు అంత సీన్ లేదంటున్న బీజేపీ ఫైర్‌బ్రాండ్!
By: Tupaki Desk | 31 July 2022 6:45 AM GMTతెలంగాణాలోనూ రాజన్న రాజ్యం తెస్తానని కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు.. వైఎస్ షర్మిల. వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసి ప్రస్తుతం ఆమె పాదయాత్ర చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరని.. కేసీఆర్ కుటుంబం తప్ప మరెవరూ తెలంగాణలో బాగుపడలేదని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్ షర్మిలపై బీజేపీ లేడీ ఫైర్ బ్రాండ్ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు తెలంగాణలో అంత సీన్ లేదని తేల్చిచెప్పారు. గత ఎన్నికల్లో ఏపీలో తన అన్న జగన్ కు మద్దతుగా ప్రచారం చేసిన షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం ఏమిటని డీకే అరుణ నిలదీశారు. పార్టీ పెట్టుకోవాలనుకున్నా, పోటీ చేయాలనుకుంటున్నా ఆంధ్రాలో చేసుకోవాలన్నారు.
తెలంగాణ కోడల్ని, ఆడపడుచుని అంటూ షర్మిల చెప్పే కల్లిబొల్లి కబుర్లను తెలంగాణ ప్రజలు నమ్మరని తేల్చిచెప్పారు. ఆంధ్రా పాలకుల వివక్షకు వ్యతిరేకంగానే తెలంగాణ ఏర్పాటు అయ్యిందన్నారు. అలాంటి తెలంగాణలో షర్మిలకు ఏ అవకాశం ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణలో షర్మిల పార్టీ ప్రభావం ఏమీ ఉండదన్నారు. తన కుటుంబ సభ్యులతో వచ్చిన విభేదాలతోనే షర్మిల తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టారన్నారు.
వైఎస్ షర్మిల తెలంగాణ కోసం ఇప్పటివరకు చేసిందేమీ లేదన్నారు. ఏనాడూ ఆమె తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం డిమాండ్ చేయలేదన్నారు. తెలంగాణలో ఎవరికి పడితే వారికి అధికారం ఇవ్వడానికి ప్రజలు సిద్దంగా లేరని డీకే అరుణ స్పష్టం చేశారు. తెలంగాణ సెంటిమెంట్ ఉన్నంతవరకు ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ ఎవరెన్ని పార్టీలు పెట్టినా వర్కవుట్ కాదన్నారు.
కాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల నుంచి గతంలో సమాజ్‌వాదీ పార్టీ తరఫున, కాంగ్రెస్ తరఫున డీకే అరుణ గెలుపొందారు. అంతేకాకుండా వైఎస్సార్ కేబినెట్‌లో మంత్రిగానూ పనిచేశారు. ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆ పార్టీలో ముఖ్య నాయకుల్లో ఒకరిగా ఉన్నారు. మరోవైపు డీకే అరుణ కూడా రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే.