Begin typing your search above and press return to search.
'టీ బీజేపీ' చీఫ్ గా డీకే అరుణ ఫిక్స్ .... రాజాసింగ్ అసంతృప్తి !
By: Tupaki Desk | 5 Dec 2019 5:38 AM GMTగత కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీ బండిని ముందుకు నడిపే నాయకుడు ఎవరు అంటూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆ పదవి కోసం ఆశపెట్టుకొని ఉన్నవారి లిస్ట్ కొంచెం పెద్దగా ఉన్నప్పటికీ ..హై కమాండ్ మాత్రం ..తెలంగాణ లో డైనమిక్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్న డీకే అరుణ తెలంగాణ బీజేపీ అధ్యక్షురాలిగా దాదాపుగా ఖరారు అయ్యింది అని విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో పార్టీ విస్తరణకు చొరవ ఉన్న డీకే అరుణ అయితే బాగుంటుందని బీజేపీ హై కమాండ్ యోచిస్తోంది. అధ్యక్ష పదవీ కట్టబెట్టి.. పార్టీని క్షేత్రస్థాయి లో బలపరచాలని అనుకుంటుంది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ నుండి అరుణ కి కాల్ రావడంతో ఆమె హుటాహుటిన ఢిల్లీ కి వెళ్లినట్టు సమాచారం. అక్కడ బీజేపీ చీఫ్ అమిత్ షా, కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా అరుణ కు అధ్యక్ష బాధ్యతకు సంబంధించి సమాచారం అందజేసే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ లో డీకే అరుణ అయితే పార్టీ ని ముందుకు నడిపిస్తుంది అని , అందరిని కలుపుకొని పోయి వచ్చే ఎన్నికల లోపు ఒక బలమైన పార్టీగా ఏర్పర్చుతుంది అని హై కమాండ్ భావిస్తుంది. అందుకే అధ్యక్ష పదవీ కి డైనమిక్ లీడర్ కి అప్పగిస్తోంది.
మరోవైపు అధ్యక్షుడు లక్ష్మణ్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వెల్లగక్కిన మరునాడే డీకే అరుణ పేరు తెరపైకి రావడం విశేషం. మంగళవారం ఓ కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కూడా రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధ్యక్షుడి గా బండి సంజయ్ లేదంటే డీకే అరుణను నియమించాలని కోరారు. అయన చెప్పిన రెండు రోజుల్లోనే అరుణ కు హైకమాండ్ నుంచి పిలుపురావడం విశేషం. తెలంగాణ రాష్ట్రం లో బీజేపీ కి ముఖ్య నేతలు ఉన్నారు కానీ.. క్షేత్రస్థాయి లో క్యాడర్ లేదు. దీంతో ఆయా ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం చూపలేకపోతుంది. దీనితో డీకే అరుణ అయతే బాగుంటుందని, పార్టీని మంచి స్థానానికి తీసుకొస్తారని భావిస్తున్నారుఅయితే , అధ్యక్ష పదవి కోసం వేయి కళ్ళతో ఎదురుచూసే వారు చాలామంది ఉన్నారు. దీంతో డీకే అరుణ అభ్యర్థిత్వాన్ని అంగీకరించే వారేవరు అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. కొందరు ఆమె కి వ్యతిరేకంగా మారితే పరిస్థితి ఏంటీ అన్న ప్రశ్న తలెత్తుతుంది. కానీ పార్టీ నేతలంతా కలుపుకొని పనిచేయాలని సూచించినట్టు తెలుస్తోంది. చూడాలి మరి అరుణ కి మద్దతు గా నిలిచేదెవరో .. వ్యతిరేకంగా మారేదెవరో ..