Begin typing your search above and press return to search.
టీకాంగ్రెస్ కూసాలు కదిలే షాక్.. కమలం గూటికి డీకే!
By: Tupaki Desk | 20 March 2019 4:57 AM GMTతెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే చాలు.. దశాబ్దాలుగా రాష్ట్రం కోరుకుంటున్న తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెడతారని.. తెలంగాణను గిఫ్ట్ గా ఇస్తే.. తమకు పవర్ ను రిటర్న్ గిఫ్ట్ ఇస్తారన్న కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఎంత తప్పన్న విషయం ఆ పార్టీ అధినాయకత్వానికి అర్థమయ్యే పరిణామాలు గడిచిన ఐదేళ్లుగా అర్థమయ్యేలా పరిస్థితులు చోటు చేసుకోవటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వెలువడిన ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీని తెలంగాణలో ఘోరీ కట్టే దిశగా ప్రయాణిస్తున్నాయని చెప్పాలి.
ఇది నిజమన్న ఒక ఘటన తాజాగా జరిగింది. ఎమ్మెల్యేలుగా గెలిచిన అభ్యర్థులు ఒకరి తర్వాత ఒకరు గులాబీ కారులోకి ఎక్కేందుకు వెళ్లిపోతుండగా.. ఓడిన ముఖ్యనేతలు సైతం పార్టీని వీడిపోవటం చూస్తే తెలంగాణ కాంగ్రెస్ ఖాళీ కావటం ఖాయమన్న భావన కలగటం ఖాయం. ఇందుకు సంబంధించిన కీలక పరిణామం ఒకటి తాజాగా చోటు చేసుకుంది.
మాజీ మంత్రి.. కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత.. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ట్రాక్ రికార్డుతో పాటు.. కేసీఆర్ పేరెత్తితే చాలు విరుచుకుపడే మహిళా ఫైర్ బ్రాండ్ డీకే అరుణ తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకోవటం సంచలనంగా మారింది.
అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చేలా ఆమె ఢిల్లీలో బీజేపీ అధినేత అమిత్ షాతో భేటీ కావటం.. ఆయన సమక్షంలో గులాబీ పార్టీ కండువాను కప్పుకోవటం చకచకా జరిగిపోయాయి. ఈ ఘటనతో తెలంగాణ కాంగ్రెస్ కు దిమ్మ తిరిగేలా షాక్ తగలటం ఒక ఎత్తు అయితే.. ఇక కాంగ్రెస్ పార్టీ ఖాళీ కావటమన్న భావనను కలిగించేలా చేసిందని చెప్పాలి.
అత్యంత నాటకీయంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో డీకే అరుణ కమలంగూటికి చేరుకున్నట్లుగా చెబుతున్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ చొరవతో మంగళవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నాటకీయంగా డీకే అరుణ ఇంటికి రాంమాధవ్ వెళ్లటం.. ఆమెతో భేటీ అయ్యాక అప్పటికప్పుడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన డీకే అరుణ.. అమిత్ షాతో సమావేశం అయ్యారు.
తాజాగా జరిగే ఎంపీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి డీకే అరుణను బరిలోకి దింపేందుకు షా ఓకే చెప్పటం.. ఆమె రాజకీయ భవిష్యత్తుకు ఆయన హామీ ఇవ్వటం.. ఆ సంగతి పార్టీ చూసుకుంటుందన్న మాటతో డీకే అరుణ అప్పటికప్పుడు బీజేపీలో జాయన్ అయిపోయారు.
దీంతో.. మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి జరిగే ఎన్నిక మరో మలుపు తిరిగినట్లైందని చెప్పక తప్పదు. ముందుగా అనుకున్న సమీకరణాల్లో మార్పు చోటు చేసుకోవటమే కాదు.. టీఆర్ఎస్ సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసుకోక తప్పదన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా డీకే అరుణ తాజా ఎపిసోడ్ తో తెలంగాణ కాంగ్రెస్ కు భారీ షాక్ కు గురి చేసేలా చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.