Begin typing your search above and press return to search.

అరుణ‌మ్మ పిటీష‌న్‌ ను సుప్రీం కొట్టేసినా..?

By:  Tupaki Desk   |   7 Aug 2015 9:35 AM GMT
అరుణ‌మ్మ పిటీష‌న్‌ ను సుప్రీం కొట్టేసినా..?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ విల‌క్ష‌ణ‌త గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా చేసే విష‌యంలో ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌ని ఆయ‌న‌.. కొన్ని విష‌యాల్లో చాలా క‌ఠినంగా ఉంటారు.

లెక్క‌లు కుద‌ర్లేదో.. లేదంటే మ‌రేదైనా సెంటిమెంట్ ఉందో కానీ.. రాష్ట్రమంత్రి వ‌ర్గంలో ఒక్క మ‌హిళ‌కు కూడా స్థానం ఇవ్వ‌లేదు. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ఉద్య‌మాలు చేసి మ‌రీ సాధించుకున్న రాష్ట్రంలో ఒక్క మ‌హిళ అంటే ఒక్క మ‌హిళ‌కు కూడా మంత్రివ‌ర్గంలో స్థానం ఇవ్వ‌ని కేసీఆర్ తీరుపై ప‌లువురు విమ‌ర్శ‌లు చేయ‌టం తెలిసిందే. అయితే.. దీనిపై కేసీఆర్ పెద్ద‌గా స్పందించింది లేదు.

అయితే.. మాజీ మంత్రి డీకే అరుణ మాత్రం అంద‌రి మాదిరి అడిగి ఊరుకోకుండా.. సుప్రీంకోర్టుకు వెళ్లారు. తెలంగాణ మంత్రివ‌ర్గంలో మ‌హిళ‌ల‌కు స్థానం క‌ల్పించాల‌ని ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె సుప్రీంకోర్టు గ‌డ‌ప తొక్కారు.

దీనిపై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు.. రాష్ట్ర మంత్రివ‌ర్గంలో మ‌హిళ‌ల‌కు స్థానం క‌ల్పించాల‌ని తాము రాష్ట్రాల‌కు ఆదేశాలు జారీ చేయ‌లేమ‌ని చెబుతూ.. అరుణ‌మ్మ ద‌ర‌ఖాస్తును కొ్ట్టేశారు. ఒక‌విధంగా అరుణ‌మ్మ పోరాటం మొద‌టి అడుగులోనే ఆగిపోయింది. ఇది ఆమెకు కాస్త ఇబ్బంది క‌లిగించినా.. ఆమెకు ద‌క్కిన ఒక ఊర‌ట ఏమిటంటే.. ఈ కేసుపై వ్యాఖ్యానిస్తూ.. తెలంగాణ క్యాబినెట్ లో మ‌హిళ‌ల‌కు స్థానం క‌ల్పించి ఉంటే బాగుండేద‌ని అభిప్రాయ‌ప‌డింది. కేసు ప‌రంగా అరుణ‌మ్మ‌కు ఎదురుదెబ్బ అయిన‌ప్ప‌టికీ.. నైతికంగా మాత్రం ఆమె లేవ‌నెత్తిన ప్ర‌శ్న మాత్రం స‌బ‌బు అన్న విష‌యాన్నిసుప్రీం త‌న వ్యాఖ్య‌తో చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లుగా ఉంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.