Begin typing your search above and press return to search.
జైపాల్ కు చెక్..డీకే అరుణ కొత్త రాజకీయాలు
By: Tupaki Desk | 18 Jan 2019 4:39 PM GMTతెలంగాణ కాంగ్రెస్ లో కొత్త రాజకీయం మొదలైంది. పరాజయ భారంతో ఉన్న ఆ పార్టీ సీనియర్లు తమ కొత్త ఎత్తుల్లో భాగంగా ఇతర నేతలకు ఇరకాటంలో పడేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా - సీనియర్ నేత - మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి...ఫైర్ బ్రాండ్ నాయకురాలు డీకే అరుణ షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ చేతిలో ఓడిపోయిన అరుణ ఎంపీ సీట్ పై కన్నేశారు. ఈ క్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారని, ఇందులో భాగంగా విందు రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారు.
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో రెండు లోక్ సభ స్థానాలుండగా..వీటిలో నాగర్ కర్నూల్ సీట్ ఎస్సీలకు రిజర్వ్ అయింది. జనరల్ సీటు అయిన గత ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ నేత జితేందర్ రెడ్డిపై ఓడిపోయిన జైపాల్ రెడ్డి మహబూబ్ నగర్ సీటు నుంచి మళ్లీ పోటీకి ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈసారి ఆ సీటుపై డీకె అరుణ కన్నువేసినట్లు సమాచారం.మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించిన డీకే అరుణ ఇటీవల పార్టీ సీనియర్ నేతలను విందు సమావేశానికి ఆహ్వానించారు. హైదరాబాదులోని గండిపేట వద్ద గల ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేసిన విందు సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా పార్టీ సీనియర్లు జానారెడ్డి - రేవంత్ రెడ్డి - మల్లుభట్టి విక్రమార్క - ఇంకా పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. తద్వారా తన మద్దతును ఆమె చాటుకున్నట్లు సమాచారం.
ఇదిలాఉండగా, ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో డీకె అరుణ - జైపాల్ రెడ్డి విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నారాయణపేట స్థానాన్ని శివకుమార్ రెడ్డికి ఇవ్వాలని అరుణ పట్టుబట్టారు. అయితే, చివరకు జైపాల్ రెడ్డి అనుచరుడు సరాఫ్ కృష్ణకు టికెట్ దక్కింది. జైపాల్ రెడ్డి వల్ల వర్గవిభేదాలు చోటు చేసుకుని పార్టీకి నష్టం జరుగుతోందనే సంకేతాలను అరుణ అధిష్టానానికి పంపించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. మరోవైపు, డీకే అరుణతో పాటు రేవంత్ రెడ్డి కూడా మహబూబ్ నగర్ టికెట్ ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో దోస్తీ చేసి, జైపాల్ రెడ్డికి చెక్ పెట్టడం ద్వారా మహబూబ్ నగర్ టికెట్ సాధించాలనే పట్టుదలతో డీకె అరుణ ఉన్నట్లు చెబుతున్నారు.