Begin typing your search above and press return to search.
వాళ్లంతా పనిపాటలేని వాళ్లంటున్న అరుణ!
By: Tupaki Desk | 8 Oct 2016 7:44 AM GMTకాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే డీకే అరుణ మరోమారు తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం ద్వారా ఎట్టకేలకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గద్వాలను జిల్లా కేంద్రంగా చేసుకున్న అరుణ అనంతరం ఓ రాజకీయ ఆరోపణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గద్వాల జిల్లాగా చేసిన నేపథ్యంలో ఆమె టీఆర్ ఎస్ లో చేరనున్నారనే టాక్ మొదలైంది. టీఆర్ ఎస్ కీలక నేత కేకే ను కలవడంతో ఈ చర్చ ప్రారంభం అయింది. అయితే ఈ ప్రచారంపై అరుణ ఘాటుగా స్పందించారు.
తాను పార్టీ మారనున్నట్లు చేస్తున్న ప్రచారంలో ఒక్క శాతం కూడా నిజం లేదని డీకే అరుణ స్పష్టం చేశారు. తాను వందశాతం కాంగ్రెస్ లోనే ఉంటానని తేల్చిచెప్పారు. తాను టీఆర్ ఎస్ లో చేరనున్నట్లుగా ప్రచారం చేసే వారంతా పనీ పాటా లేని వాళ్లేనని అరుణ మండిపడ్డారు. నడిగడ్డ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ గద్వాలను జిల్లాగా చేసిన విషయంలో సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అరుణ వివరించారు. మంచి పనికి థ్యాంక్స్ చెప్పినా విమర్శలు చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/