Begin typing your search above and press return to search.
గులాబీ దళపతి డిఫెన్స్ లో పడే మాట!
By: Tupaki Desk | 30 Jun 2018 6:58 AM GMTతెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల ప్రకటన నేపథ్యంలో ఈ వేడి మొదలవగా..తాజాగా ఆయన జిల్లాల పర్యటనలతో అధికార ప్రతిపక్షాలన్నీ...మాటలకు పదునుపెడుతున్నాయి. ఒకరిపై మరొకరు ఎదురుదాడి చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మరోవైపు సహజంగానే అధికార టీఆర్ ఎస్ పార్టీ తనదైన శైలిలో ప్రతిపక్ష కాంగ్రెస్ ను ఇరకాటంలో పడేసేందుకు ఓ వైపు అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్ ను వేగంగా కొనసాగిస్తోంది. ఈ ఒరవడిలో భాగంగానే పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. సహజంగానే కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. వలసల జిల్లాను ఓట్ల కోసం వాడుకొని వదిలేశారని ఆరోపించారు.
ఇలా ముఖ్యమంత్రి తమపై ఎదురుదాడి చేసిన నేపథ్యంలో పాలమూరు జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయకురాలు డీకే అరుణ రంగంలోకి దిగారు. గులాబీ దళపతి కార్యక్రమంపై దుమ్మెత్తిపోశారు. అసలు టీఆర్ ఎస్ అవినీతి వల్లే...ప్రాజెక్టులు ఆగిపో్తున్నాయని ఆరోపించారు. ఉద్యమ ద్రోహులకు పెద్దపీట వేస్తున్నారంటూ..గులాబీ దళపతి డిఫెన్స్ లో పడే మాట చెప్పారు. దీంతోపాటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యానికి ఏమైంది? అనే సందేహాన్ని కలిగించేలా కూడా కామెంట్లు చేశారు. గట్టు ఎత్తిపోతల పథకం బీజం వేసింది తాను అని పేర్కొంటూ ఏం చేయకపోయినా..అంత మీము చేశాం అని సీఎం కేసీఆర్ చెప్పుకుంటున్నాడని అరుణ విరుచుకుపడ్డారు. ఎదుటి వాడు చేసిన పని చేశాడు అని చెప్పటానికి ఎందుకు అంత మొహమాటం? అంటూ కేసీఆర్ తీరును ఎద్దేవా చేశారు. పాలమూరు ఎంపీగా ఐదేండ్లు చేసి ఏం ఉద్ధరించావ్ అంటూ కేసీఆర్ కు డీకే అరుణ సూటి ప్రశ్న వేశారు. `. అబద్ధాలు సహించేదిలేదు. పాలమూరు ప్రాజెక్ట్ లకు ప్రాణం పోసింది కాంగ్రెస్. ఉమ్మడి పాలమూరులో టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏమి లేదు. కల్వకుర్తి లిఫ్ట్ ఆగిపోవటానికి బాద్యుడు మంత్రి జూపల్లి.ఈ విషయాన్ని తెలుపకుండా మళ్ళీ మళ్ళీ నోరెత్తితే మర్యాదగా ఉండదు`` అని అరుణ హెచ్చరించారు.
తాను 1969లోనే జై తెలంగాణ అని నినదించానని తెలిపిన అరుణ..ఆ సమయంలో కేసీఆర్ సహా టీఆర్ ఎస్ నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను టీఆర్ ఎస్ మోసం చేస్తోందని అరుణ మండిపడ్డారు. ``కాంగ్రెస్ చేస్తోంది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అన్నారు..మరి మీరు చేస్తుంది ఏంటి? జోగులాంబ అమ్మవారి ఆలయం అభివృదికి ఇప్పటికి ఒక్క కోటి అయినా ఇచ్చినవ కేసీఆర్? జోగులాంబ అమ్మవారిని కూడా కేసీఆర్ మోసం చేసిండు. అలాంటి కేసీఆర్ కి జోగులాంబా ఆశీస్సులు ఎలా ఉంటాయి? గద్వాల నుంచే టీఆర్ ఎస్ పతనం ప్రారంభం అవుతుంది. రెండేళ్లలో బతికుంటే..అని పదే పదే కేసీఆర్ అనటం ఎందుకు? అలాంటి మాటల అర్థం ఏంటి? కేసీఆర్ చల్లగా ఉండు`` అంటూ తనదైన శైలిలో అరుణ ముక్తాయించారు.