Begin typing your search above and press return to search.
అదేంది అరుణమ్మ.. మద్యం వ్యాపారం తో ఎదిగి ఇప్పుడు దీక్షలా?
By: Tupaki Desk | 13 Dec 2019 6:44 AM GMTకొన్ని పనులు కొందరికి ఏ మాత్రం సూట్ కావు. ఆ ప్రయత్నంతో ఉన్న ఇమేజ్ కూడా పోగొట్టుకునే పరిస్థితి. తాజాగా బీజేపీ నేత డీకే అరుణకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఉందని చెబుతున్నారు. తాజాగా ఆమె మద్యాన్ని నిషేధించాలని.. మద్యం కారణంగానే సమస్త నేరాలకు కారణంగా మారినట్లుగా ఆమె మండి పడుతున్నారు. ఇందులో భాగంగా ఆమె రెండు రోజుల పాటు దీక్షను చేపట్టారు.
డీకే అరుణ చేపట్టిన దీక్షపై తెలంగాణ అధికారపక్షం తీవ్రంగా తప్పు పట్టింది. గద్వాల ఎమ్మెల్యే సీన్లోకి వచ్చి డీకే అరుణ గాలి తీసేలా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడా వ్యాఖ్యలు అందరిని ఆకర్షిస్తున్నాయి. మద్యం వ్యాపారంతో ఉన్న సంబంధంతోనే డీకే అరుణ కుటుంబం పైకి వచ్చినట్లుగా పేర్కొన్నారు. మద్యపాన నిషేధం అమల్లోకి తేవాలంటూ దీక్ష చేస్తున్న ఆమె.. తమ కుటుంబం ఆర్థికంగా ఈ రోజున ఉన్నత స్థాయిలో ఉందంటే దానికి కారణం మద్యం వ్యాపారమేనన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు.
మద్యం వ్యాపారం తో పైకి వచ్చిన అరుణ.. ఈ రోజున మద్యానికి వ్యతిరేకం గా దీక్ష చేస్తుంటే గద్వాల ప్రజలు నవ్వుతున్నారన్నారు. గద్వాల జిల్లాలో 40 బెల్ట్ షాపులతో మద్యాన్ని విచ్చల విడిగా ఏరులై పారిస్తున్నట్లుగా ఆరోపించారు. ఓవైపు ఆమె.. ఆమె కుటుంబ సభ్యులు వ్యాపారం చేస్తూ మరోవైపు మద్యానికి వ్యతిరేకంగా నిరసన దీక్షలు చేయటమా? అని ప్రశ్నిస్తున్నారు. దీక్ష వేళ మైలేజీ రాకున్నా ఫర్లేదు.. డ్యామేజీ జగరకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు.