Begin typing your search above and press return to search.

బీజేపీని టార్గెట్ చేసిన డీకే అరుణ‌

By:  Tupaki Desk   |   5 Jun 2022 7:59 AM GMT
బీజేపీని టార్గెట్ చేసిన డీకే అరుణ‌
X
గ‌ద్వాల్ జేజెమ్మ‌గా గుర్తింపు పొందిన సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కురాలు, మాజీ మంత్రి డీకే అరుణ.. సంచ‌ల న వ్యాఖ్య‌లు చేశారు. అది కూడా తాను ఉన్న బీజేపీ పార్టీపైనే తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. నిజానికి పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన అరుణ‌.. గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు కూడా ఇదే త‌ర‌హా విమ‌ర్శ‌లు చేసేవారు. కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం ఎక్కువనే కార‌ణంగా.. ఆమె ఎలాంటి వ్యాఖ్య‌లు చేసినా.. స‌ర్దుకు పోయేవారు.

ఇక‌, త‌ర్వాత‌.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో ఉంటూ.. కేసీఆర్‌పైనా.. టీఆర్ ఎస్ నేత‌ల‌పైనా.. ఆమె తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న విష‌యం తెలిసిందే. అంతేకాదు.. ఇటీవ‌ల అమిత్ షా నిర్వ‌హించిన‌.. స‌భ‌లోనూ ఆమె కేసీఆర్ స‌ర్కారుకువ్య‌తిరేకంగా గ‌ళం వినిపించారు. అలాంటి డీకే అరుణ‌.. తాజాగా అదే బీజేపీ పాలిత రాష్ట్రాల‌కు సంబంధించి తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం అరుణ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు.

అమెరికాలోని ఎన్నారై ఇంటికి వెళ్లిన ఆమె.. భార‌త‌దేశంలోని రాష్ట్రాలు, అక్క‌డి రాజ‌కీయాలు, ప్ర‌జ‌ల ప‌రిస్థితుల‌పై మాట్లాడారు. ఈ క్ర‌మంలో ఆమె.. కొన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లుచేశారు. ``ద‌క్షిణ భార‌త దేశం(ఏపీ, తెలంగాణ‌, ఒడిసా, కేర‌ళ‌, త‌మిళ‌నాడు)లో ఆక‌లితో అల‌మ‌టిస్తున్న ప్ర‌జ‌లు కానీ, ప్రాంతాలు కానీ.. లేవ‌ని చెప్పారు. అంతేకాదు.. ఈ స‌మ‌యంలోనే ఆమె ఉత్త‌ర భార‌త‌దేశం(యూపీ, అస్సాం, బిహార్‌, మ‌ధ్య ప్ర‌దేశ్ త‌దిత‌రాలు)లోనే ప్ర‌జ‌లు ఆక‌లితో ఉంటున్నార‌ని చెప్పారు.

నిజానికి ఆమె చెప్పిన రాష్ట్రాల్లో యూపీలో బీజేపీ పాలిత ప్ర‌భుత్వం న‌డుస్తోంది. అదేవిధంగా బిహార్‌లో బీజేపీ పాల‌క ప‌క్షంగా ఉంది. ఇక‌, అస్సాంలో కూడా బీజేపీనే ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తోంది. మ‌రి అలాంట‌ప్పుడు ఆయా రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు ఆక‌లితో అల‌మ‌టిస్తున్నార‌ని డీకే అరుణ చెప్ప‌డం అంటే.. బీజేపీ పాలిత ప్ర‌బుత్వాలు ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సౌక‌ర్యాలు క‌ల్పించ‌డం లేద‌ని, క‌నీసం వారికి తిండి కూడా పెట్ట‌డం లేద‌ని.. డీకే అరుణ చెప్ప‌డమే అవుతుంది. దీనిని బ‌ట్టి ఆమె ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్టీని ఆమె విమ‌ర్శించినట్టే క‌దా.. అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి అరుణ కామెంట్ల‌పై బీజేపీ అదిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.