Begin typing your search above and press return to search.

దెబ్బకి దెబ్బ కొట్టిన కాంగ్రెస్ ..ఆనందం లో డీకే !

By:  Tupaki Desk   |   12 Nov 2019 7:08 AM GMT
దెబ్బకి దెబ్బ కొట్టిన కాంగ్రెస్ ..ఆనందం లో డీకే !
X
దేశ చరిత్ర లో వందేళ్ళ కి పైగా చరిత్ర కలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్. కాలం కలిసి రాక ప్రస్తుతం గడ్డు కాలం లో నడుస్తుంది కానీ , మొన్నటి వరకు ఏక చక్రాధిపత్యం గా కాంగ్రెస్ దేశాన్ని కొన్నేళ్ల పాటు ఏలింది. అలాగే కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల పార్టీ గా దేశ వ్యాప్తం గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత జరిగిన అనేక రాజకీయ పరిణామాల తో కాంగ్రెస్ ప్రస్తుతం తీవ్రమైన కష్టాల లో కూరుకు పోయింది. అయినా కూడా కాంగ్రెస్ ని తక్కువ అంచనా వేస్తే .. సింహం నోట్లో తల దూర్చినట్టే .. కాంగ్రెస్ వ్యూహాల కి ఎలాంటి వారైనా కూడా గిర్రున తిరగాల్సిందే. ఇక పోతే ప్రస్తుతం బీజేపీ దేశ వ్యాప్తం గా తన సత్తా ఏంటో చూపిస్తూ అన్ని రాష్ట్రాల లో పాగా వేయాలని ఆలోచిస్తుంది. అలాగే మోడీ ప్రధాని గా ఎన్నికైన తరువాత బీజేపీ హావ బాగా పెరిగి పోయింది.

ఇక ఆ విషయం కాసేపు పక్కన పెడితే ..ప్రస్తుతం మహారాష్ట్ర లో జరుగుతున్న రాజకీయాన్ని చూసి కర్ణాటక కాంగ్రెస్ నేతలు అమితానందం లో మునిగి పోయారు. అందరి కంటే ముఖ్యం గా రాష్ట్ర సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి డి.కె.శివకుమార్‌ మరింతగా ఆనందించి వుంటారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని అనిపిస్తుంది. అసలు మహారాష్ట్ర లో ఎదో జరిగితే ..కర్ణాటక కాంగ్రెస్ నేతల కి ఎందుకు ఆనందం అని అనుకుంటున్నారా ...అది తెలియాలి అంటే ముందు గతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి ...

కుమారస్వామి నాయకత్వం లోని సంకీర్ణ ప్రభుత్వం సజావు గానే సాగుతున్న తరుణం లో కాంగ్రె్‌స్ కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలని , జేడీఎ్‌స్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను బీజేపీ వ్యూహాత్మకం గా ఆపరేషన్‌ కమల పేరిట పదవులు ఆశ చూపి ..రిసార్ట్ రాజకీయాల కి తెరతీసింది. ప్రభుత్వాని కి వ్యతిరేకం గా మారిన ఈ ఎమ్మెల్యేలని, మహా రాష్ట్ర రాజధాని ముంబై లోని ఒక ప్రముఖ హోటల్‌ కు తరలించారు. అప్పట్లో మహారాష్ట్ర లో అధికారం లో ఉన్న ఫడ్నవీస్‌ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యేల కి టైట్ సెక్యూరిటీ ఇచ్చి రాచ మర్యాదలు చేసారు. ఈ విషయం లో ఆ అసంతృప్త ఎమ్మెల్యేల తో మాట్లాడి తీసుకు రావడానికి అప్పటి మంత్రి డి.కె.శికుమార్‌ ముంబై కు వెళ్ళారు. కానీ ,ఆయన్ని ఆ హోటల్ లోకి కూడా అనుమతించ లేదు. దాని పై అయన అక్కడే వర్షం లో నిలబడి నిరసన తెలియజేసారు. ఆ తరువాత కర్ణాటక లో కాంగ్రెస్ , జేడీఎస్ ప్రభుత్వం కూలి పోవడం ...బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగి పోయింది. ఈ మొత్తం వ్యవహారానికి మహా రాష్ట్ర బీజేపీ కి సంబంధం లేక పోయినా కూడా ..ఎమ్మెల్యేల కు ముంబై లో రక్షణ కల్పించడం ద్వారా పరోక్షం గా కాంగ్రెస్ , జేడీఎస్ పతనానికి కారణమైంది.

ఆ ఘటన అనంతరం డీకే శివ కుమార్‌ చుట్టూ ఈడీ ఉచ్చు బిగించింది. కేసులు పాతవే అయినా ఆయన తీహార్‌ జైలు పాలయ్యారు. ఈ కేసుల్లో బెయిలు రాక ఆయన చాల కాలం ఇబ్బందుల పాలవడం తెలిసిందే. చివరికి ఎలాగోలా బెయిల్‌ దొరికి ప్రస్తుతం విడుదల కావడం తెలిసిందే. ఈ సమయంలోనే మహారాష్ట్ర లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో బీజేపీ అతి పెద్ద పార్టీ గా అవతరించింది. దీనితో శివసేన తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని అందరూ భావించారు. కానీ , శివసేన సీఎం పీఠం పై పట్టు గట్టిగ పట్టడం తో బీజేపీ అతి పెద్ద పార్టీగా నిలిచినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక పోయింది. ఇప్పుడు తాజాగా మహారాష్ట్రలో శివసేన సారథ్యం లో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వానికి కాంగ్రెస్‌ బయటి నుంచి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. అధిష్ఠానం తీసుకున్న ఈ సంచలన నిర్ణయానికి కర్ణాటక కాం గ్రెస్‌ నేతలు కూడా సమర్ధించారు.

మహారాష్ట్ర లో అప్పటి బీజేపీ ప్రభుత్వం అన్యాయంగా అడ్డదారిలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చిందని..దానికి పరిహారం ఇప్పుడు అనుభవిస్తుంది అంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుకుంటున్నారు.