Begin typing your search above and press return to search.
పోలింగ్ వరకూ కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ ఇక్కడే
By: Tupaki Desk | 1 Dec 2018 2:30 PM GMTకాంగ్రెస్ విపత్కర పరిస్థితులను ఎదుర్కున్నప్పుడు ఆయన అండగా నిలిచారు. ఏకంగా కాంగ్రెస్ నేత సోనియాగాంధీకి పరువు సమస్యగా మారిన సమయంలో చక్రం తిప్పారు. గత ఏడాది ఆగస్టులో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించి వారికి ఆతిథ్యమిచ్చి పటేల్ విజయం సాధించేలా చక్రం తిప్పి ఏకంగా...బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకే మైండ్ బ్లాక్ చేశారు. అనంతరం ఈ ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పరిణామం అందరికీ గుర్తుండే ఉంటుంది. కాంగ్రెస్ అధిష్టానం అనేక వ్యూహాలు పన్నినప్పటికీ...అన్నింటికీ మించి జేడీఎస్-కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేజారకుండా చేసి ఆ పార్టీ కూటమే గద్దెనెక్కేందుకు కారణమైంది కన్నడ ప్రజలకు డీకేఎస్ గా సుపరిచితుడైన మాజీ మంత్రి డీకే శివకుమార్. ఇప్పుడు ఈ ట్రబుల్ షూటర్ తెలంగాణ పాలిటిక్స్‌లో కీలక దశలో `పోల్ మేనేజ్ మెంట్` చేస్తున్నారు.
కర్ణాటక ఎన్నికల్లో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. బీజేపీ పెద్దలకు ప్రధానంగా - మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. క్లిష్ట పరిస్థితుల్లో ఎమ్మెల్యేలను ఈగల్టన్ రిసార్ట్‌కు తరలించి ఆతిథ్యం ఇవ్వడంతోపాటు హైదరాబాద్ కు తరలించడం - మళ్లీ కర్ణాటకకు సురక్షితంగా తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి సర్కారు ఏర్పాటు చేయించిన డీకే శివకుమార్ తాజాగా తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ట్రబుల్ షూటర్ గా ఆయన రాజకీయాలను డీల్ చేస్తున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగేందుకు మరో వారం మాత్రమే సమయం ఉండటం...కీలకమైన పోల్ మేనేజ్ మెంట్ కు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన మళ్లీ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించగా ఆపార్టీకి రెబెల్స్ తాకిడి ఎక్కువైంది. గాంధీభవన్ ముందు ఆందోళనలు - నిరసనలు కొనసాగిన సంగతి తెలిసిందే. వీరందరిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ త్రిసభ కమిటిని రంగంలోకి దించింది. అసమ్మతి నేతలతో చర్చలు జరిపింది. ఈ త్రిసభ్య కమిటీలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి - మంత్రి మల్లాది కృష్ణారావు - కర్నాటక మంత్రి డికె శివకుమార్ ఉన్నారు. ఈ ఎపిసోడ్ విషయంలో డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరించి అందరినీ `సెట్` చేశారు.
తెలంగాణ ఎన్నికల బరిలో దిగే సమయంలో ఆయన వ్యవహరించిన తీరుతో మళ్లీఆయనకు కాంగ్రెస్ కీలక బాధ్యతలు అప్పగించింది. రెబెల్స్ ని బరిలో నుంచి తప్పించడంలో కీలకంగా వ్యవహరించిన శివకుమార్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తన వ్యూహాలను అమలు చేసేందుకు కర్ణాటక పీసీసీ బృందంతో హైదరాబాద్ లో వాలారు. శివకుమార, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండురావు - పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలంగాణలో పార్టీ పరిస్థితిని స్థానిక నేతలతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వ్యూహరచన చేస్తున్నారు. ఆయనతో పాటు కన్నడ మీడియా కూడా తెలంగాణలో దిగిపోవడం కొసమెరుపు.