Begin typing your search above and press return to search.
కారణం చెప్పలేదు.. మెరుపుదాడులపై మాట్లాడట!
By: Tupaki Desk | 27 Feb 2019 7:49 AM GMTదేశ వ్యాప్తంగా ప్రజలంతా ఆనందంగా ఉన్న వేళ.. భారతప్రభుత్వం జరిపిన మెరుపుదాడులపై తాను వ్యాఖ్యానించనని చెప్పటం ద్వారా వార్తల్లోకి వచ్చారు కర్ణాటక మంత్రి.. సీనియర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్. తాజాగా భారత సర్కారు చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ 2పై తాను మాట్లాడనని.. తమ పార్టీ పెద్దలు మాత్రమే మాట్లాడతారని ఆయన వ్యాఖ్యానించారు. పలు ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు చేసేందుకు బళ్లారి వచ్చిన ఆయన.. విలేకరులతో మాట్లాడారు.
తమ పార్టీ భారత సైనికులకు అండగా ఉంటుందన్నారు. అదే సమయంలో పాక్ ఉగ్రవాదులపై దాడుల గురించి తానిప్పుడు మాట్లాడనన్న ఆయన.. ఎన్నికలకు ముందు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవటంపై ప్రజలే నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇదిలా ఉండగా.. పార్టీ సీనియర్ నేత.. ఇటీవల అనారోగ్యంతో కాలం చేసిన అంబరీశ్ స్థానంలో మాండ్య లోక్ సభ స్థానం నుంచి ఆయన సతీమణి సుమలతకు పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు.
త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బళ్లారితోపాటు.. మెజార్టీ స్థానాల్లో పార్టీ విజయం ఖాయమని చెప్పిన ఆయన.. మాండ్య సీటును కూటమి సర్దుబాటులో భాగంగా జేడీఎస్ కు వదలాల్సి వస్తోందని.. అందుకే టికెట్ వచ్చే అవకాశం లేదన్నారు. అయితే.. సుమలతకు పార్టీలో సముచిత స్థానం లభిస్తుందన్న హామీ ఆయన ఇచ్చారు. దీనిపై సుమలత స్పందించాల్సి ఉంది.