Begin typing your search above and press return to search.
టాస్క్ మాస్టర్ కు రాహుల్ డబుల్ థమాకా!
By: Tupaki Desk | 21 May 2018 7:41 AM GMTకర్ణాటకలో బీజేపీ సర్కారును రెండు అంటే రెండు రోజుల్లో గద్దె దింపటమే కాదు.. అవమానకర స్థితిలోకి వెళ్లేలా చేయటం.. ఎలాంటి సానుభూతి వ్యక్తం కాకుండా చేయటంలో కీలకంగా వ్యవహరించి.. బీజేపీ అగ్రనేతలు మోడీ.. అమిత్ షాలకు షాకుల మీద షాకులు ఇచ్చిన ఘనత కర్ణాటక సీనియర్ నేత డీకే శివకుమార్ కు దక్కింది.
క్యాంప్ రాజకీయాలు మొదలు.. బీజేపీ నేతల బేరసారాలకు సంబంధించిన కాల్స్ ను రికార్డు చేయటం పక్కా స్కెచ్ వేసిన శివకుమార్ కు కాంగ్రెస్ భారీ బహుమానాన్ని ఇవ్వనున్నట్లు చెబుతున్నారు.
ఇప్పటికే ఆయనకు కుమారస్వామి మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా పగ్గాలు ఇప్పించనున్నట్లు చెబుతున్నారు. ఇక్కడితో ఆగకుండా కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాల్ని అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల వ్యవధిలో శివకుమార్ అమలు చేసిన వ్యూహాలు.. ప్రత్యర్థులు వేస్తున్న ఎత్తులకు పైఎత్తుల విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఫుల్ పాజిటివ్ గా మారిందని.. తానే మొత్తంగా మారి చక్రం తిప్పిన ఆయన్నుప్రత్యేకంగా అభినందించినట్లు చెబుతున్నారు.
కాంగ్రెస్ కూటమి నుంచి ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేలా జాగ్రత్తగా వ్యవహరించిన ఆయనకు పార్టీ పదవి.. మంత్రి పదవిని ఇప్పించే దిశగా పావులు కదులుతున్నాయి. బీజేపీలోకి చేరేందుకు సిద్ధమైన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని గోల్డ్ ఫించ్ నుంచి అనూహ్యంగా బయటకు తీసుకురావటంతో శివకుమార్ కీలకంగా వ్యవహరించారు. అందుకోసమే ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. శివకుమార్ కు దక్కాల్సిన గుర్తించి ఆయన కష్టానికి తగ్గట్లే లభించిందని చెప్పక తప్పదు.