Begin typing your search above and press return to search.
వైసీపీలోకి వెళ్తున్నా.. స్పష్టం చేసేసిన డీఎల్
By: Tupaki Desk | 28 Feb 2017 8:49 AM GMTతాను వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచే బరిలో దిగుతానని.. ఇతర పార్టీలకు వెళ్లే ప్రసక్తే లేదని మాజీ మంత్రి డీఎల్ రవీంద్ర రెడ్డి స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలికిన ఆయన ఆ తర్వాత మౌనంగా ఉండిపోయారు. ఇటీవల కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి నేరుగా డీఎల్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. దాంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన వర్గం వైఎస్ వివేకాకే మద్దతు ఇస్తుందని డీఎల్ బహిరంగంగానే ప్రకటించారు. దీంతో డీఎల్ వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం ఇప్పటికే మొదలైంది.. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన తన వైఖరిని స్పష్టం చేశారు. జగన్ తనకు ఫోన్ చేసి మాట్లాడారని.. తాను వైసీపీలో చేరబోతున్నానని చెప్పారు. వైసీపీలో తనకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని ఆయన తెలిపారు. అదే సమయంలో పలు అంశాలపై మాట్లాడితే అనేక సంచలన విషయాలు వెల్లడించారు.
తాను వైసీపీ వైపు అడుగులు వేస్తున్నట్టుగానే భావించాలని చెప్పారు. తన అనుచరులు కూడా వైసీపీలో చేరడంపై చాలా ఆసక్తిగా ఉన్నారని వెల్లడించారు. వైఎస్ వివేకానందరెడ్డి చర్చలు జరిపిన తర్వాత వైఎస్ జగన్ కూడా నేరుగా ఫోన్ చేశారని డీఎల్ చెప్పారు. అయితే వివరాలను బయటపెట్టేందుకు డీఎల్ నిరాకరించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచే పోటీ చేస్తానని వెల్లడించారు. తాను, వైఎస్ తొలి నుంచి ప్రాణస్నేహితులమని డీఎల్ చెప్పారు.
జగన్ కు వ్యతిరేకంగా హైకోర్టులో వేస్తున్న పిటిషన్ పై సంతకం చేయాల్సిందిగా కాంగ్రెస్ పెద్దలు తొలుత తననే సంప్రదించారని డీఎల్ బయటపెట్టారు. కానీ స్నేహితుడి కుమారుడి జీవితం నాశనం చేసే పని తాను చేయనని చెప్పానన్నారు. పైగా జగన్‌పై కేసు వేయడం చాలా తప్పుడు పని అవుతుందని ముందే హెచ్చరించానన్నారు. జగన్ రాజకీయ జీవితాన్ని దెబ్బతీసేలా తానెప్పుడు వ్యవహరించలేదన్నారు డీఎల్.
అప్పట్లో మైసురారెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి నాటు సారా వ్యాపారం చేసేవారని డీఎల్ బయటపెట్టారు. ఆ సమయంలోనే మైదుకూరులో లిక్కర్ కల్తీ జరిగి 18 మంది చనిపోయారని… దాని వల్లే జేసీ దివాకర్ రెడ్డి, తాను మంత్రి పదవి పొగొట్టుకోవాల్సి వచ్చిందన్నారు. అయితే.. మైసూరాకు ప్రస్తుతం లిక్కర్ కు సంబంధించి ఎలాంటి వ్యాపారాలు లేవు కానీ దివాకరరెడ్డికి ఇప్పుడు లిక్కర్ షాపులు ఉన్నాయని.. ప్రస్తుతం నాటుసారా వ్యాపారం ఆయనకు కూడా లేదని చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/