Begin typing your search above and press return to search.
వైసీపీలోకి మాజీ మంత్రి డీఎల్
By: Tupaki Desk | 21 Aug 2018 6:52 AM GMT2014 ఎన్నికల తరువాత సైలెంటయిపోయినా మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో చేరబోతున్నట్లు సమాచారం. ఇందుకు అంతా సిద్ధమైనట్లు తెలుస్తోంది.
మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నేత డీఎల్ రవీంద్రారెడ్డికి అక్కడి టిక్కెట్ ఇవ్వడానికి పార్టీ సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. మైదుకూరు అసెంబ్లీ స్థానం ప్రస్తుతం వైసీపీ ఖాతాలోనే ఉంది. రఘురామిరెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ సారి తెలుగుదేశం పార్టీ టీటీడీ చైర్మన్ గా ఉన్న సుధాకర్ యాదవ్ ను మైదుకూరు నుంచి పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు తెలియడంతో ఆయనపై డీఎల్ ను బరిలో దించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
రఘురామిరెడ్డి సిటింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ సుధాకర్ యాదవ్ ను ఎన్నికల్లో ఆర్థికంగా డీకొట్టాలంటే డీఎల్ అయితేనే బెటరని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. డీఎల్ కు టిక్కిటిస్తే రఘురామిరెడ్డికి ఎమ్మెల్సీగా పంపించడానికి జగన్ సుముఖంగా ఉన్నారట.
కాగా రాజకీయంగా ఖాళీగా ఉన్న డీఎల్ కోసం ఇంతకుముందు టీడీపీ ప్రయత్నాలు చేసింది. అయితే... ఆయన టీడీపీలోకి వెళ్లేందుకు ఇష్టపడలేదు. ఇప్పుడు వైసీపీతో చర్చలు కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది.