Begin typing your search above and press return to search.
డీఎల్ఎఫ్ లంచం కేసు .. లాలూకు సీబీఐ క్లీన్ చిట్ !
By: Tupaki Desk | 22 May 2021 7:30 AM GMTలంచం కేసులో మాజీ రైల్వే శాఖ మంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. దాణా కుంభకోణం కేసులో ఇప్పటికే మూడేళ్ల పాటు జైలు జీవితం గడిపిన లాలూ ప్రసాద్ యాదవ్ గత ఏప్రిల్ లోనే జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు డీఎల్ ఎఫ్ కేసులో కూడా ఉపశమనం దక్కింది. లాలూ ప్రసాద్ యాదవ్‌కి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లభించకపోవడం తో సీబీఐ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ క్లీన్ చీట్ ఇచ్చినప్పటికి , ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్ తమ విచారణ కొనసాగించనుంది.
ముంబైలోని బాంద్రా, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ ప్రాజెక్టులకు సంబంధించి డీఎల్ ఎఫ్ గ్రూప్ నుంచి లాలూ లంచం తీసుకున్నాడన్న ఆరోపణలు వచ్చాయి. సీబీఐ ఆర్థిక నేరాల విభాగం 2018 జనవరిలో ఈ కేసు విచారణను ప్రారంభించింది. రెండేళ్ల విచారణలో లాలూపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని సీబీఐ అధికారులు తేల్చారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పలు అక్రమాలు జరిగాయని పేర్కొంటూ సీబీఐ దర్యాప్తు బృందం ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిందని చెప్పాయి. ముందటి తేదీలు వేసిన చెక్కులు, బోగస్ లావాదేవీలు, లాలూ కుటుంబ సభ్యులకు అతి తక్కువ ధరలకే ఆస్తుల బదలాయింపు వంటి వాటిలో అక్రమాలు జరిగాయని అన్నారు. ఆదాయపన్ను శాఖ కూడా దీనిపై ప్రత్యేక దర్యాప్తును చేపడుతోంది.
లంచం తీసుకుని డీఎల్ ఎఫ్ సంస్థకు అనుకూలంగా లాలూ తన పవర్స్ దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై 2018 జనవరిలో కేసు నమోదు చేసింది సీబీఐ, ఆర్థిక నేరాల విభాగం. కేసు నమోదైన కొత్తలో పూర్వపు స్టాంపు పేపర్లు ఫోర్జరీ చేశారని, లాలూ కుటుంబ సభ్యులు ఆయాచితంగా లబ్ధి పొందారని,ఇలా అనేక ఆధారాలు ఆయనకి వ్యతిరేకంగా తమ వద్ద ఉన్నాయంటూ బెయిల్ కి నిరాకరించింది. దాదాపు రెండున్నరేళ్ల పాటు విచారించిన తర్వాత ఆరోపణలకు తగ్గట్టు సరైన ఆధారాలు సంపాదించలేక పోయింది సీబీఐ. దీంతో లాలూకి క్లీన్ చీట్ ఇచ్చింది. అటు బీహార్ పశుగ్రాసం కేసుకు సంబంధించి గత నెలలో ఝార్ఖండ్ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ మంజూరు చేసింది. ఆయన అనారోగ్యం దృష్ట్యా బెయిల్ ఇస్తునట్టు కోర్టు పేర్కొంది.