Begin typing your search above and press return to search.
నిండా మునిగినా కెప్టెన్ తోనే నడుస్తారట
By: Tupaki Desk | 24 May 2016 11:02 AM GMTతమిళనాడు శాసనసభ ఎన్నికల కోలాహలం ప్రారంభమైనప్పటి నుంచి ఫలితాల వరకు అందరి దృష్టిని ఆకర్షించిన డీఎండీకే పార్టీ అధ్యక్షుడు-సినీ నటుడు విజయకాంత్ ఓటమి తర్వాత కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ప్రజా సంక్షేమ కూటమి పేరుతో ఇతర పార్టీలతో జట్టుకట్టిన కెప్టెన్ పార్టీ 104 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయిన సంగతి తెలిసిందే. ఆఖరికి విజయ్ కాంత్ సైతం ఓడిపోయారు. ఇంత ఘోరంగా పరాజయం పాలైన నేపథ్యంలో మిత్రపక్షాలు - పార్టీ నేతలతో కలిసి కెప్టెన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎన్నికల సమయంలో బలంగా ఉన్నట్లుగా కనిపించినప్పటికీ పార్టీ పరాజయం పాలవ్వడానికి కారణాలపై సమీక్షించాలని కెప్టెన్ నిర్ణయించారు. ఆ మేరకు పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో మొదటి దఫాగా 15 జిల్లాల కార్యదర్శులతో ముచ్చటించి కారణాలు తెలుసుకున్నారు. పొత్తుపై తగిన నిర్ణయం తీసుకోకపోవడమే ఓటమికి కారణమని వారు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రజా సంక్షేమ కూటమిలోని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో - వీసీకే అధ్యక్షులు తిరుమావళవన్ తదితరులు విజయకాంత్ ను కలిసి మాట్లాడారు.
తమిళనాడులో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిగానే కొనసాగాలని కోరారు. దీనికి స్పందించిన విజయకాంత్ పార్టీ సభ్యులతో సమావేశమై తన నిర్ణయాన్ని చెబుతానని వారికి సమాధానం ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయినప్పటికీ ఆ వెంటనే జరిగిన సమీక్ష సమావేశం సందర్భంగా తర్వాతి ఎన్నికల్లోనూ కలిసి పోరాటం చేద్దామనే క్రేజీ ప్రపోజల్ తెరమీదకు రావడం కెప్టెన్ సత్తాకు నిదర్శనమని చెప్తున్నారు.