Begin typing your search above and press return to search.

డీఎంకేలో కుంప‌టి మొద‌లైంది

By:  Tupaki Desk   |   3 Jan 2017 8:15 AM GMT
డీఎంకేలో కుంప‌టి మొద‌లైంది
X
త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత ఆ రాష్ట్ర రాజ‌కీయాల్లో ఊహించ‌ని ట్విస్ట్‌ లు తెర‌మీద‌కు వ‌స్తున్న‌ట్లుగా క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే అమ్మ‌కు చెందిన అన్నాడీఎంకేలో శ‌శిక‌ళ వ‌ర్సెస్ ప‌న్నీర్ సెల్వం- జ‌య మేన‌కోడలు దీపా అన్న అంత‌ర్గ‌త వార్ న‌డుస్తుంటే ఇపుడు అదే కోవ‌లోకి విప‌క్ష‌మైన డీఎంకే వ‌చ్చి చేరింది. డీఎంకే ర‌థ‌సార‌థి కరుణానిధి నుంచి వార‌స‌త్వం స్వీక‌రించ‌డమ‌నే విష‌యంలో ఆ పార్టీలో ఇపుడు మూడు స్థంబాల‌ట న‌డుస్తోంది. ఈ విష‌యంలో పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం నిర్వ‌హించి నిర్ణ‌యం తీసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిందంటే విప‌క్షంలో నెల‌కొన్న ప‌రిస్థితులు ఏ స్థాయికి చేరుకున్నాయో అర్థం చేసుకోవ‌చ్చు!

డీఎంకేలోని ఇటీవ‌లి ప‌రిణామాల ప్రకారం క‌రుణ వార‌సుడు స్టాలిన్ అనే ప్ర‌చారం జోరుగా సాగింది. అయితే క‌రుణానిధి పెద్ద కుమారుడు - డీఎంకే కింగ్ మేక‌ర్ గా పేరొందిన అళ‌గిరి రీ ఎంట్రీతో ఈ కుటుంబ రాజ‌కీయం మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది. పార్టీ బ‌లోపేతం - త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల నేప‌థ్యంలో అళ‌గిరి తిరిగి డీఎంకేలోకి రావాల‌నే వాద‌న పెరుగుతోంది. అంతేకాదు ఆయ‌న‌కు కీల‌క బాధ్య‌త‌లు క‌ట్ట‌బెట్టాల‌ని ప‌లువురు కోరుతున్నారు. అదే స‌మ‌యంలో క‌రుణ కూతురు క‌నిమొళికి సైతం ప‌లువురు మ‌ద్ద‌తు ఇస్తూ ఆమెను ప్రాధాన్యం ఉన్న నాయ‌కురాలిగా పార్టీ ప్ర‌క‌టించాల‌ని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో పార్టీలో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి ఎవ‌రికి ఇస్తార‌నే చ‌ర్చ సాగుతోంది. అయితే స్టాలిన్ ను కీల‌క బాధ్య‌త‌ల్లో నియ‌మిస్తూ పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం నిర్ణ‌యం తీసుకుంటుంది అని మాత్రం డీఎంకే వ‌ర్గాలు చెప్తున్నాయి.

కాగా ఈ స‌మావేశానికి క‌రుణానిధి హాజ‌ర‌వ‌డంపై స‌స్పెన్స్ నెల‌కొంది. ఆయ‌న హాజ‌రవుతార‌ని చెప్తున్న నేత‌లు అధ్య‌క్ష ప‌ద‌విలో క‌రుణ కొన‌సాగుతారా లేదా అనే విష‌యంలో మాత్రం ఉత్కంఠ‌తో ఉన్నారు. గ‌తంలోనే ఈ స‌మావేశం జ‌ర‌గాల్సి ఉన్న‌ప్ప‌టికీ క‌రుణానిధి ఆస్ప‌త్రి పాల‌వ‌డంతో వాయిదా ప‌డింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/