Begin typing your search above and press return to search.

కూతురు కొడుకుతో కోర్టుకు కరుణ

By:  Tupaki Desk   |   18 Jan 2016 6:42 AM GMT
కూతురు కొడుకుతో కోర్టుకు కరుణ
X
రాజకీయాలు ఎంత కర్కసంగా ఉంటాయో తమిళనాడు రాజకీయాలు చూసినోళ్లు ఇట్టే అర్థమవుతాయి. ఎలాంటి మొహమాటాలకు తావివ్వని రీతిలో సాగే తమిళ రాజకీయాల పుణ్యమా అని 92 ఏళ్ల వయసులో డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కుమార్తె కనిమొళి.. కొడుకు స్టాలిన్ తో కలిసి సోమవారం కోర్టు ఎదుట హాజరయ్యారు.

పరువునష్టం కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వేసిన కేసు విచారణలో భాగంగా కరుణ కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. ఒక పత్రికలో వచ్చిన వ్యాసం ఆధారంగా జయపై కరుణ విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు తన పరువును దెబ్బ తీసేలా ఉన్నాయంటూ ఆమె కేసు వేయటంతో కోర్టు ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ అయ్యాయి.

దీంతో.. కరుణ కోర్టుకు హాజరయ్యారు. కేసును విచారించిన కోర్టు తదుపరి విచారణను మార్చి 3కి వాయిదా వేశారు. తమకెలాంటి పరిస్థితి ఎదురైందో.. అలాంటి పరిస్థితులు తమ ప్రత్యర్థులకు ఎదురయ్యేలా చేయటం తమిళనాడు రాజకీయాల్లో మామూలే. మరి.. ఇంత ముదిమి వయసులో కరుణ కోర్టు వచ్చిన పరిస్థితులు భవిష్యత్తు రాజకీయాల్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో..?