Begin typing your search above and press return to search.
రజనీ పార్టీలోకి కరుణ కొడుకు?
By: Tupaki Desk | 14 Aug 2018 7:31 AM GMTరాజకీయాలు ఎప్పుడూ చాలా చిత్రంగా ఉంటాయి. ఏమైనా జరగొచ్చన్నది బిగ్ బాస్ 2 ట్యాగ్ లైన్ కానీ.. అంతకు మించినట్లుగా ఊహించని పరిణామాలు చోటు చేసుకోవటం కామన్. రాజకీయాల్లో శాశ్విత మిత్రులు.. శాశ్విత శత్రువులు ఎంతమాత్రం ఉండరన్న సత్యం ఎప్పటికప్పుడు నిరూపితం అవుతూ ఉంటుంది. తాజాగా తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
తాము బతికి ఉన్నంత కాలం పార్టీకి తామే అన్నీ అన్నట్లుగా వ్యవహరించటం.. ఆ తర్వాత పార్టీలో వారసుడి వ్యవహారం మీద రచ్చ జరగటం ఆ మధ్య అన్నాడీఎంకేలో చూశాం.. ఇప్పుడు డీఎంకేలో చూస్తున్నాం. అన్నాడీఎంకేతో పోలిస్తే.. డీఎంకేలో అంతర్గత రచ్చ కాస్త తక్కువగానే ఉందని చెప్పాలి.
డీఎంకేలో తన తర్వాత తన రాజకీయ వారసుడిగా స్టాలిన్ ను కరుణ ప్రకటించటం.. అందుకు సుతారం ఇష్టం లేని ఆళగిరి పార్టీ నుంచి బయటకు పంపించి వేయటం తెలిసిందే. తండ్రి మరణం అనంతరం పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నించిన ఆళగిరి.. స్టాలిన్ నో చెప్పిన దరిమిలా.. ఆయన తనదైన శైలిలో పావులు కదపటం మొదలెట్టినట్లుగా చెబుతున్నారు.
డీఎంకేను చీల్చటం ఒక వాదన వినిపిస్తుంటే.. మరోవైపు తమిళసూపర్ స్టార్ రజనీని పెట్టే పార్టీలో ఆళగిరి చేరనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కరుణ అనారోగ్యంతో ఉన్న వేళ.. ఆయన్ను పరామర్శించేందుకు వెళ్లిన రజనీతో ఆళగిరి భేటీ కావటం.. సన్నిహితంగా ఉండటం చూసిన వారంతా ఆళగిరి ఇప్పుడు రజనీ పార్టీలో చేరే అవకాశం ఉందన్న వాదననువినిపిస్తున్నారు.
డీఎంకేలో చీలిక తేవటానికి ఆళగిరి ప్రయత్నిస్తున్నారన్న మాటపై పెద్ద ఎత్తునచర్చ జరుగుతున్న వేళ.. రజనీతో ఆళగిరి భేటీకి సంబంధించిన ఫోటోను డీఎంకే విడుదల చేయటం ఆసక్తికరంగా మారింది. మరింత.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తాను రాజకీయ పార్టీ పెట్టాలని భావించిన వేళ రజనీకాంత్ కరుణ వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకోవటం మర్చిపోకూడదు. తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆశీర్వచనం తీసుకున్న నేత కొడుకు ఇప్పుడు రజనీ పార్టీలోకి చేరాల్సి వచ్చిందన్న మాట వినిపిస్తోంది. స్పష్టత లేకున్నా.. రజనీ పార్టీలో చేరేందుకు ఆళగిరి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అదెంత వరకూ నిజమో కాలమే చెప్పాలి.