Begin typing your search above and press return to search.
సుష్మాస్వరాజ్- అరుణ్ జైట్లీ మోడీవల్లే చనిపోయారుః డీఎంకే సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 2 April 2021 4:30 AM GMTతమిళనాట ఎన్నికల వేళ విమర్శలు, ఆరోపణలు తారస్థాయికి చేరుతున్నాయి. నిన్నటికి నిన్న డీఎంకే అధినేత కుమారుడు ఉదయ నిధి స్టాలిన్ తో హీరోయిన్ నయన తార రిలేషన్ పై తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ సంబంధం కొనసాగిస్తున్నారని బీజేపీ నేత, సీనియర్ నటుడు రాధారవి సంచలన ఆరోపణలు చేసినట్టు వార్తలు వచ్చాయి.
తాజాగా.. ఉదయ నిధి స్టాలిన్ ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ చనిపోవడానికి మోడీయే కారణమని ఆరోపించినట్టు సమాచారం. అంతేకాకుండా.. బీజేపీ తెలుగు నేత వెంకయ్య నాయుడిని కూడా ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారని, ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి ఆయనను లాక్ చేశారని ఆరోపించారట ఉదయనిధి.
ఇక, తమిళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న పళనిస్వామి మోడీకి పూర్తిగా లొంగిపోయారని, అందుకే వంగి దండాలు పెడుతున్నారని ఆరోపించినట్టుగా తెలుస్తోంది. కానీ.. తాను అలాంటి పిరికి వాడిని కాదని, కలైంజర్ కరుణానిధి మనవడిని వ్యాఖ్యనించినట్టు సమాచారం. ఉదయనిధి స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాట దుమారం రేపుతున్నాయి. కాగా.. ఈ వ్యాఖ్యలపై సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ వారసులు స్పందించినట్టుగా తెలుస్తోంది.
ఎన్నికల లబ్ధికోసం తమ వారి పేర్లను వాడుకోవద్దని కోరినట్టు సమాచారం. ప్రధాని మోడీ తన తల్లిని గౌరవించేవారని సుష్మ కూతురు బన్సూరి చెప్పినట్టుగా తెలుస్తోంది. మరోవైపు అరుణ్ జైట్లీ కూతురు సోనాలి కూడా స్పందించి.. ఉదయ నిధి చేసిన ఆరోపణలు సరికాదని ఖండించినట్టుగా తెలుస్తోంది.