Begin typing your search above and press return to search.
డీఎంకే సభ్యులపై మూకుమ్మడి వేటు
By: Tupaki Desk | 18 Feb 2017 8:40 AM GMT తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పళనిస్వామి ప్రభుత్వ బలనిరూపణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అసెంబ్లీలో రచ్చ రచ్చ చోటు చేసుకోవటంతో పాటు.. అసాధారణ సంఘటనలు చోటు చేసుకున్నాయి. పళనిస్వామి ప్రభుత్వ బలనిరూపణకు డివిజన్ల వారీగా ఎన్నిక నిర్వహించాలని స్పీకర్ ధన్ పాల్ తీసుకున్న నిర్ణయాన్ని విపక్ష డీఎంకే సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించటం.. రహస్య ఓటింగ్ నిర్వహించాలని పట్టుబట్టటం తెలిసిందే.
అయితే.. రహస్య ఓటింగ్ కు స్పీకర్ ససేమిరా అనటంతో డీఎంకే సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అసాధారణ పరిణామాలకు తెర తీశారు. స్పీక్పర్ పోడియంను ధ్వంసం చేయటం మొదలు.. స్పీకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. డీఎంకే ఎమ్మెల్యేలు కొందరు స్పీకర్ జబ్బ పట్టుకొని లాగటం.. ఆయన చొక్కా పట్టుకోవటం లాంటి విపరీత పరిణామాలకు తెర తీశారు. దీంతో.. ఏర్పడిన గందరగోళంతో తొలుత సభను వాయిదా వేసిన స్పీకర్.. ఒంటిగంటకు మరోసారి సభను ఏర్పాటు చేశారు.
సభ ప్రారంభమైన తర్వాత కూడా.. సభ్యుల్ని శాంతింపచేయాలని ప్రయత్నించినా.. ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. సభ్యులుశాంతంగా ఉండాలంటూ పదే పదే స్పీకర్ కోరినప్పటికీ.. సభ్యులు మాట వినలేదు. స్పీకర్ పోడియం చుట్టూ చేరి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సభ్యులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన స్పీకర్.. చివరకు డీఎంకే సభ్యులందరిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన సభ్యుల్ని సభ నుంచి పంపేందుకు వీలుగా సభను మధ్యాహ్నం మూడు గంటల వరకూ వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యే లోపు.. సస్పెండ్ అయిన సభ్యులను సభ నుంచి బయటకు పంపేందుకు స్పీకర్ ఆదేశాలు ఇచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/