Begin typing your search above and press return to search.
చేతులు కలిపినందుకే రూ.500 కోట్ల ఆఫర్?
By: Tupaki Desk | 26 March 2016 4:52 AM GMTవివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు ఎండీఎంకే నేత వైగో. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారన్న పేరున్న ఆయనకు.. తమిళులంటే అంతులేని అభిమానం. తమిళుల ప్రయోజనాల కోసం ఎంతకైనా వెళ్లే ఆయన.. తాజాగా తమిళనాడులో కెప్టెన్ గా పిలుచుకునే విజయ్ కాంగ్ మీద కన్నెర్ర చేశారు. విజయ్ కాంత్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు.
డీఎండీకే అధినేత విజయ్ కాంత్ తో పొత్తు పెట్టుకునేందుకు అటు డీఎంకే.. ఇటు బీజేపీ రెండు పార్టీలు కిందా మీదా పడ్డాయని.. భారీ ఎత్తున డబ్బు.. పదవులు ఎర వేసినట్లుగా ఆరోపించారు. విజయ్ కాంత్ కానీ తమతో పొత్తు పెట్టుకునేందుకు చేతులు కలిపితే డీఎంకే భారీ ఆఫర్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. కేవలం.. డీఎంకేతో చేతులు కలిపేందుకు కెప్టెన్ ఓకే చెబితే ఏకంగా రూ.500కోట్లతో పాటు.. కూటమి తరఫున 80 అసెంబ్లీ స్థానాలు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చినట్లు వైగో ప్రకటించారు.
ఒక్క డీఎంకే మాత్రమే కాదు.. బీజేపీ కూడా కెప్టెన్ కోసం భారీ గాలాన్నే వేసినట్లుగా వైగో ఆరోపించారు. విజయకాంత్ కానీ తమతో చేతులు కలిపితే రాజ్యసభ సభ్యత్వంతో పాటు.. కేంద్రమంత్రి పదవిని కూడా కన్ఫర్మ్ చేస్తామని ఆఫర్ ఇచ్చినట్లుగా వైగో వెల్లడించారు.ఈ ఆఫర్ లో నిజానిజాల మాటేమో కానీ.. వైగో మాటలు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.