Begin typing your search above and press return to search.
ఎన్నికల్లో స్వీప్ చేసినా ఆ పార్టీకి ఆనందం లేదు!
By: Tupaki Desk | 27 May 2019 4:52 PM GMTతమిళనాట డీఎంకే నేత స్టాలిన్ సీఎం అవుతాడా? లేదా? అనేది ఇంకా మిస్టరీగానే మిగిలింది. ఇన్నేళ్లూ తండ్రి చాటు కొడుకుగా, 'మాజీ డిప్యూటీ సీఎం' అనే హోదాతో మాత్రమే మిగిలారు స్టాలిన్. అయితే కరుణానిధి మరణానంతరం డీఎంకేకు అంతా తాను అయ్యాడు స్టాలిన్. అవతల జయలలిత కూడా లేకపోవడంతో స్టాలిన్ కు తిరుగు ఉండదని, ఈ ఎన్నికల్లో తమిళనాట స్టాలిన్ ఆధ్వర్యంలో డీఎంకే స్వీప్ చేస్తుందని పరిశీలకులు అంచనా వేశారు.
ఆ అంచనాలే నిజం అయ్యాయి. డీఎంకే ఈ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విక్టరీని సాధించింది తమిళనాట. అన్నాడీఎంకే చిత్తు అయ్యింది. కాంగ్రెస్-డీఎంకేలు కలిసి పోటీ చేసి మెజారిటీ ఎంపీ సీట్లను నెగ్గాయి. బీజేపీ-అన్నాడీఎంకేల కూటమి చిత్తు అయ్యింది.
మరి అలా బ్రహ్మాండమైన విజయాన్ని సాధించినా స్టాలిన్ కు అయితే ఎలాంటి పదవీ ఇప్పుడు దక్కేలా లేదు. అదే డీఎంకే వాళ్ల అసంతృప్తికి కారణం. తమిళనాట ఎంపీ సీట్లలో డీఎంకే- కాంగ్రెస్ లు స్వీప్ చేసినా.. కేంద్రంలో మాత్రం వీరి కూటమి అధికారానికి చాలా చాలా దూరంలో నిలిచింది. కాంగ్రెస్ పక్షాన నిలిచి.. బీజేపీకి శత్రువు అయిపోయి కేంద్రంలో అధికారానికి దూరం అయ్యాడు స్టాలిన్. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయకపోయుంటే. స్టాలిన్ ఇప్పుడు ఎంచక్కా బీజేపీ వైపు వెళ్లిపోయే అవకాశం ఉండేది.
ఇక అన్నాడీఎంకే తరఫున నెగ్గింది ఒకే ఒక ఎంపీ. అతడికి కేంద్రంలో మంత్రి పదవి ఖాయమైనట్టుగా తెలుస్తోంది. అదీ ఆ పార్టీ వాళ్ల జాక్ పాట్. ఇక తమిళనాట కొన్ని అసెంబ్లీ సీట్లకు బై పోల్ జరిగింది. వాటన్నింటినీ డీఎంకే నెగ్గి ఉంటే.. పళనిస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడేది. ఆ ప్రభుత్వం కూలిపోయేది. అప్పుడు స్టాలిన్ కు అవకాశం దక్కేది. అయితే.. అది కూడా జరగలేదు. అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికల్లో డీఎంకే స్వీప్ చేయలేకపోయింది. దీంతో అక్కడా అవకాశం దక్కలేదు. ఇలా సంచలన విజయాన్నే సాధించినా.. డీఎంకే అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అధికార పార్టీ అనిపించుకోలేకపోతోంది!