Begin typing your search above and press return to search.

బ్ర‌తికుంటే అమ్మ‌- చిన్న‌మ్మ క‌లిసితినేవారు చిప్ప‌కూడు

By:  Tupaki Desk   |   12 Feb 2018 11:26 AM GMT
బ్ర‌తికుంటే అమ్మ‌- చిన్న‌మ్మ క‌లిసితినేవారు చిప్ప‌కూడు
X
త‌మిళ ప్ర‌జ‌ల నుంచి రాజ‌కీయ నాయ‌కుల వ‌ర‌కు దేవుళ్ల కంటే..పాలించే నాయ‌కుల్ని ఎక్కువ‌గా కొలుస్తుంటారు. అందుకే సంబంధిత నాయ‌కుల ఫోటోల్ని జేబుల్లో కానీ - హోట‌ళ్ల‌లో - అసెంబ్లీలో ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. ఆ ట్రెండ్ నాటి ఎంజీఆర్ నుంచి నేటి జ‌య‌ల‌లిత వ‌ర‌కు కొన‌సాగుతుంది. అలా త‌మిళ‌నాడు స్వ‌ర్గీయ సీఎం జ‌య‌ల‌లిత ఫోటోను అసెంబ్లీలో పెట్టేందుకు అన్నాడీఎం కే ప్ర‌య‌త్నించింది. కానీ ప్ర‌తిప‌క్ష‌నేత డీఎంకే అమ్మ ఫోటో పెట్ట‌డాన్ని వ్య‌తిరేకిస్తూ ప్ర‌భుత్వంపై అవాకులు చెవాకులు పేల్చింది.

అసెంబ్లీలో జ‌య‌ల‌లిత ఫోటోను పెట్ట‌డంపై విమ‌ర్శించిన డీఎంకే నేత స్టాలిన్ నిప్పులు చెరిగారు. జ‌య‌ల‌లిత బ‌తికి ఉంటే శ‌శిక‌ళ‌తో క‌లిసి జైల్లో చిప్పకూడు తినేదని మండిప‌డ్డారు. మ‌హామ‌హుల ఫోటోల మ‌ధ్య ఆర్ధిక నేరాల‌కు పాల్ప‌డిన జ‌య‌ల‌లిత ఫోటో పెట్ట‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. తమిళ ఖ్యాతిని దేశానికి చాటిచెప్పిన ముఖ్య‌మంత్రుల ఫోటోల మ‌ధ్య జ‌య‌ల‌లిత ఫోటో పెట్ట‌డం క‌రెక్ట్ కాద‌ని , త‌క్ష‌ణ‌మే తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. అంతేకాదు ఇదే అంశంపై మద్రాస్‌ హైకోర్టులో డీఎంకే పార్టీ పిటిషన్‌ కూడా దాఖలు చేసింది. అయితే ఈవేం ప‌ట్టించుకోని ప్ర‌భుత్వం స్పీక‌ర్ ధ‌న్ పాల్ ఏడు ఫీట్లున్న జ‌య‌ల‌లిత ఫోటోను ప్ర‌తిప‌క్షాలు కూర్చునే బెంచ్ ఎదురుగా ఆవిష్క‌రించారు.