Begin typing your search above and press return to search.
అధికారమే లక్ష్యం.. డీఎంకేతో పీకే దోస్తీ
By: Tupaki Desk | 3 Feb 2020 6:02 AM GMTజేడీయూ నుంచి బహిష్కరించడంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన భవిష్యత్ పై దృష్టి సారించాడు. ఆయన్ను జేడీయూ బహిష్కరించినప్పటి నుంచి ఆ పార్టీలో చేరుతాడు.. ఈ పార్టీలో చేరుతాడని ప్రచారం సాగింది. అయితే ఆయన యథావిధిగా తన పూర్వ వృతి వైపు మళ్లారు. రాజకీయంలో పొసగక పోవడంతో ఇప్పుడు మళ్లీ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాడు. గతంలో సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోదీ (బీజేపీ), బీహర్ లో నితీశ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చేలా తీవ్రంగా కృషి చేసిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు తాజాగా తమిళనాడు రాష్ట్రానికి వెళ్తున్నాడు.
తమిళనాడు లో రాజకీయాలు పూర్తిగా మారి పోయాయి. రాజకీయ ఉద్ధండులు జయలలిత, కరుణానిధి మరణించడంతో రాజకీయ శూన్యత ఏర్పడింది. వారి వారసులుగా ఎవరూ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయాలు భిన్నంగా ఉన్నాయి. తమిళనాడులో 2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ప్రశాంత్ కిశోర్ పని చేయనున్నాడు. ఈ మేరకు డీఎంకే అధినేత స్టాలిన్ ప్రశాంత్ కిశోర్ తో కలిసి పని చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం స్టాలిన్ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. పీకే టీమ్ తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
తొలిసారిగా జయలలిత, కరుణానిధి లేకుండా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఉన్న ప్రధాన పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే మధ్య పోటీ ఎలా ఉంటుందో ఆసక్తికరంగా మారింది. జయలలిత వరుసగా రెండుసార్లు అధికారం చేజిక్కించుకోవడంతో ఆమె ఉన్నన్నాళ్లు అన్నాడీఎంకే పార్టీకి తిరుగులేదు. అయితే జయలలిత మరణం తో అన్నాడీఎంకే కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. ప్రస్తుతం ఆ పార్టీలో వర్గ పోరు తీవ్రంగా ఉంది. డీఎంకేలో స్టాలిన్ కు ఎదురు ఎవరూ లేకున్నా రజనీకాంత్, కమల్ హాసన్ రూపేణ కొంత ఇబ్బందులు ఏర్పడనున్నాయి. అందుకే వీటన్నిటి నేపథ్యంలో రాజకీయానికి వ్యూహాలు తోడయితే అధికారం తమదేనన్న భావనతో పీకేతో డీఎంకే దోస్తీ చేసింది.
జయలతిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో వచ్చిన వర్గపోరును పావుగా వాడుకుని బీజేపీ జతకలిసింది. దీంతో బీజేపీ, అన్నాడీఎంకేలు జోడి కట్టాయి. దీంతో తమిళనాడులో ప్రతిపక్షంగా ఉన్న డీఎంకే అధికారానికి దూరమై పదేళ్లయ్యింది. దీంతో ఈసారి ఎలాగైనా అధికారం సొంతం చేసుకోవాలని స్టాలిన్ ఎదురుచూస్తున్నాడు. అతడి నాయకత్వంలోని ఆ పార్టీ గతేడాది లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంది. ఇప్పుడు అదే ఉత్సాహం తో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని దానికి పీకే సహాయం తీసుకుందామని స్టాలిన్ నిర్ణయం ఆ మేరకు ప్రశాంత్ కిశోర్ తో కలిశాడు. ప్రస్తుతానికి డీఎంకే బలంగా ఉన్నా బీజేపీ, రజనీకాంత్, కమల్ హాసన్ తదితరులు కొంత ప్రభావం చేసే అవకాశం ఉండడంతో పీకేను వ్యూహకర్తగా తీసుకున్నాడు. పీకే టీమ్ డీఎంకే అధికారంలోకి వచ్చేలా వ్యూహాలు సిద్ధం చేస్తే తాము అమలుచేసి అధికారం చేజిక్కించుకోవాలని స్టాలిన్ భావిస్తున్నాడు.
ప్రశాంత్ కిశోర్ నేతృత్వం లోని ఐ పాక్ సంస్థ ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కి పని చేస్తుండగా ఆ ఎన్నికలు ఫిబ్రవరిలో ముగుస్తాయి. అనంతరం పశ్చిమ బెంగాల్ లోనూ మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కు కూడా ప్రశాంత్ కిశోర్ పని చేస్తున్నాడు. తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి కూడా ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీలకు వ్యూహాలు రచించడంతో ప్రశాంత్ కిశోర్ తో పాటు అతడి బృందం బిజీబిజీగా ఉంది. ఇక ప్రశాంత్ కిశోర్ వ్యూహం ఢిల్లీలో పని చేసిందా? అనేది ఈ నెలలోనే తెలియనుంది. ఇక వచ్చే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో పీకే పనితీరు ఏమిటో 2021లో మనం చూస్తాం.