Begin typing your search above and press return to search.

ప‌ళ‌ని చేతులు ప‌ట్టుకొని అడిగినా నో చెప్పారు

By:  Tupaki Desk   |   14 Aug 2018 2:09 PM GMT
ప‌ళ‌ని చేతులు ప‌ట్టుకొని అడిగినా నో చెప్పారు
X
రాజ‌కీయ నేత‌ల మాట‌ల‌కు ఉండే ప్రాధాన్య‌త ఎంతో. స‌రైన స‌మ‌యంలో మాట్లాడే మాట‌కు ఉండే విలువ అంతా ఇంతా కాదు. అదే స‌మ‌యంలో మాట్లాడే మాట విష‌యంలో టైమ్ తేడా కొడితే జ‌రిగే న‌ష్టం మామూలుగా ఉండ‌దు. అందుకే.. ముఖ్య‌నేత‌లంతా ఆచితూచి మాట్లాడాల‌ని చెబుతుంటారు. ఇందుకు.. ప్ర‌ధాని మోడీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లు మిన‌హాయింపుగా చెప్పాలి.

టైంతో సంబంధం లేకుండా త‌మ మాట‌ల్నిఎప్పుడు ఎలా తిప్పాలో వారికి తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీదు. ఇదంతా ఎందుకంటే.. తాజాగా డీఎంకే వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ మాట‌ల్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. క‌రుణ మ‌ర‌ణం నేప‌థ్యంలో డీఎంకే ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈసంద‌ర్భంగా స్టాలిన్ మాట్లాడిన మాట‌లు త‌మిళుల మ‌న‌సుల్ని ట‌చ్ చేసేలా ఉండ‌టం గ‌మ‌నార్హం.

తాము అభిమానించే పార్టీల‌కు అతీతంగా క‌రుణ‌ను అభిమానిస్తారు. రాజ‌కీయంగా వ్య‌తిరేక‌త వ్య‌క్తిగ‌త అంశాల‌కు మిన‌హాయింపుగా చెప్పాలి. త‌మిళ‌నాడుకు దిగ్గ‌జాలైన అమ్మ జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత‌.. క‌రుణ ఒక్క‌రే త‌మిళుల‌కు పెద్ద దిక్కులా మారారు. అలాంటి ఆయ‌న ఈ మ‌ధ్య‌నే మ‌ర‌ణించ‌టంతో త‌మిళుల శోకానికి అంతు లేకుండా పోయిన ప‌రిస్థితి.

డీఎంకే క‌రుణ‌ను పోగొట్టుకుంటే.. తాను తండ్రిని కూడా పోగొట్టుకున్నాన‌ని స్టాలిన్ వ్యాఖ్యానించారు. క‌రుణ ఆశ‌యాల కోసం ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చిన ఆయ‌న‌.. ఆయ‌న ఆశ‌య సాధ‌న కోసం కృషి చేయాల‌న్నారు. మెరీనా బీచ్ లో త‌న స‌మాధి ఏర్పాటు చేయాల‌న్న క‌రుణ చివ‌రి కోరిక‌ను సీఎం ప‌ళ‌నిస్వామి తోసిపుచ్చిన వైనంపై ఆయ‌న తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.

కరుణానిధి చివ‌రి కోరిక‌ను నెర‌వేర్చటం కోసం తాను సీఎం ప‌ళ‌నిస్వామికి క‌లిసి వేడుకున్న‌ట్లు చెప్పారు. ఆయ‌న చివ‌రి కోరిక‌గా ప‌ళ‌ని దృష్టికి తీసుకెళ్లాన‌ని.. ఒక‌ద‌శ‌లో ఆయ‌న చేతులు కూడా ప‌ట్టుకున్నాన‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ త‌న అభ్య‌ర్థ‌న‌ను ప‌ళ‌ని స‌ర్కార్ నిర్ద‌క్షిణ్యంగా తోసిపుచ్చింద‌ని ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు.

మెరీనా బీచ్ లో క‌రుణ అంత్య‌క్రియ‌ల‌కు కోర్టు ఓకే అన‌టం వెనుక క్రెడిట్ మొత్తం లాయ‌ర్ల‌దేనని చెప్పారు. అదే కానీ జ‌రిగి ఉండ‌క‌పోతే త‌మ నేత‌తో పాటు తాను కూడా స‌మాధి అయ్యేవాడిన‌ని బ‌ర‌స్ట్ అయ్యారు. స్టాలిన్ భావోద్వేగం ఇప్పుడు త‌మిళుల్ని ట‌చ్ చేయ‌ట‌మే కాదు.. విన్న వారంద‌రిని సానుభూతికి గురి చేస్తోంది.