Begin typing your search above and press return to search.
ఊహించని రీతిలో నిర్మలమ్మకు షాక్ తగిలింది!
By: Tupaki Desk | 3 May 2018 5:02 AM GMTకేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఊహించని షాక్ తగిలింది. అనుకోని రీతిలో చోటు చేసుకున్న పరిణామానికి ఆమె షాక్ తిన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆమె తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కాన్వాయ్‌పై రాళ్లు.. చెప్పుల దాడి జరగటం కలకలం రేపుతోంది.
గ్రామ్ స్వరాజ్ అభియోన్ పథకం అమలును సమీక్షించేందుకు కేంద్రం దత్తత తీసుకున్న రామ్ నాథ్ పురం.. విరుధునగర్ జిల్లాలలో ఆమె పర్యటించారు. నిర్మలా సీతారామన్ పర్యటన గురించి సమాచారం తెలుసుకున్న డీఎంకే కార్యకర్తలు పార్టీబనూర్ జంక్షన్ వద్ద ఆమె కాన్వాయ్ మీద చెప్పులు.. రాళ్లతో దాడి చేశారు.
ఊహించనిరీతిలో చోటు చేసుకున్న ఈ పరిణామం అక్కడ ఉద్రిక్తతను పెంచింది. కేంద్రమంత్రిపై దాడి గురించి తెలుసుకున్న బీజేపీ నేతలు.. కార్యకర్తలు ఘటనాస్థలానికి చేరుకొని డీఎంకే కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు.
రక్షణ మంత్రి కాన్వాయ్ పై దాడికి కారణాలు చూస్తే..కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటులో కేంద్రం ఆలసత్వానికి నిరసనగానే తాజా దాడికి పాల్పడినట్లుగా చెబుతున్నారు. ఆ మధ్యన తమిళనాడు పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీకి సైతం నిరసన జ్వాలలు తగిలాయి. ఇక.. కేంద్ర రక్షణ మంత్రికైతే నిరసన తీవ్రత ఎంతో తెలిసేలా అనుభవం ఎదురైంది. తాజా పరిణామాలతో తమిళనాడులో పర్యటించేందుకు మోడీ మంత్రులు ఒకింత వెనకడుగు వేసే పరిస్థితులు ఉన్నట్లుగా చెబుతున్నారు.