Begin typing your search above and press return to search.
మా గేదెకి DNA టెస్ట్ చేయండి సార్ .. ఎందుకంటే ?
By: Tupaki Desk | 15 March 2021 11:30 PM GMTమా గేదె కి డీఎన్ఏ టెస్ట్ చేయించండి సార్ అంటూ ఓ రైతు జిల్లా ఎస్పీకీ అర్జీ పెట్టుకున్నాడు. డీఎన్ ఏ టెస్ట్ చేయమని జిల్లా ఎస్పీకీ మొర పెట్టుకోవడం ఏంటీ అని ఆలోచిస్తున్నారా , అసలు గేదెకు డీఎన్ ఏ టెస్ట్ ఎందుకు అనుకుంటున్నారా, ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ ప్రాంతానికి చెందిన ఓ రైతు మా గేదెకు పుట్టిన దూడ కనిపించకుండా పోయింది. దాన్ని ఎవరో దొంగిలించారు అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే `క్రైమ్ కంట్రోల్ ఫార్ములా` పరిధిలోకి ఆ ఫిర్యాదు రాదని భావించిన పోలీసులు కేసు నమోదు చేయలేదు. బర్రెలు, గొర్రెలు తప్పిపోతే వెతకడానికి మాకేం పని పాట లేదనుకున్నావా అని తిట్టారు. దీంతో బాధకు గురైన రైతు తన లేగ దూడను వెతుక్కున్నాడు. కానీ ఆ గేదెకు, దూడకు డీఎన్ ఏ టెస్ట్ చేసి నాకు నా దూడను అప్పగించండి సార్ అంటూ జిల్లా ఎస్పీకీ లేఖ రాశాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ ప్రాంతానికి చెందిన చంద్రపాల్ సింగ్ అనే తన రైతు తన గేదె దూడ దొంగలించబడటం తో పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆరు నెలల క్రితం అతని గేదె తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుడ్డు అనే పేరు గల నా గేదెదూడ కనిపించట్లేదు. ఎవరో దొంగిలించారు. దయచేసి నా దూడను వెతికించి.. తెచ్చిపెట్టండీ అంటూ ఆరు నెలల క్రితం చంద్రపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే క్రైమ్ కంట్రోల్ ఫార్ములా పరిధిలోకి ఆ ఫిర్యాదు రాదని భావించి పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో చంద్రపాల్ స్వయంగా ఊరూరూ తిరిగి తన గేదెను పట్టుకోగలిగాడు. ఆ గేదె గురించి స్వయంగా షామ్లీ ఎస్పీకి లేఖ రాశాడు. `గేదె తప్పిపోయిందని నేను ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. నేను తప్పుడు ఫిర్యాదు చేశానని అంటున్నారు. దీంతో నేనే స్వయంగా నా గేదెను వెతికి పట్టుకున్నాను. దయచేసి ఆ గేదెకి డీఎన్ ఏ టెస్ట్ చేయించండి. ఆ గేదె తల్లి మా ఇంట్లోనే ఉంది. రెండు గేదెలకూ డీఎన్ ఏ టెస్ట్ చేయించి నా గేదెను నాకు అప్పగించండ`ని ఆ లేఖలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆ లేఖ వైరల్ అవుతుంది.