Begin typing your search above and press return to search.
ప్రధాని పిలుపు మేరకు లోకల్ బ్రాండ్స్ ప్రమోట్ చేయడానికి సెలబ్రిటీలు ముందుకొస్తారా...?
By: Tupaki Desk | 14 May 2020 1:30 AM GMTకరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని వ్యవస్థలు సంక్షోభంలో కూరుకుపోయాయి. అగ్రరాజ్యాలు సైతం ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. మానవ జాతికి సవాల్ విసురుతున్న ఈ మహమ్మారి వల్ల రాబోయే రోజుల్లో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో దేశ ప్రజలను ఆదుకోవడంతో పాటు.. కరోనా ప్రభావం వల్ల అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అన్ని దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మన దేశంలో ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే మూడు సార్లు లాక్ డౌన్ పొడిగించుకుంటూ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ తాజా స్పీచ్ లో లాక్ డౌన్ ను పొడిగించాలా.. వద్దా.. అనే విషయంపై ఈ నెల 18 లోగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. అంతేకాకుండా దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి పీఎం ఇచ్చిన స్పీచ్ లో 'వోకల్ అబౌట్ లోకల్' అనే వ్యాఖ్య చేసారు.
దీన్ని బట్టి మనందరం విదేశీ బ్రాండ్స్ ని పక్కన పెట్టి లోకల్ బ్రాండ్స్ ని ఎంకరేజ్ చేయాలి. అయితే దీని మీద ఎక్కువగా ఆలోచించాల్సింది సినీ సెలబ్రిటీలు. ఎందుకంటే మన హీరో హీరోయిన్స్ అందరూ ఎక్కువగా ఫారిన్ బ్రాండ్స్ కి మాత్రమే ఎండార్స్ చేస్తుంటారు. సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా నెట్ వర్క్ లలో సైతం విదేశీ కంపెనీ ఉత్పత్తుల గురించి పోస్ట్ చేస్తున్నారు. దీంతో వారి అభిమానులు సైతం ఆ కంపెనీకి చెందిన బ్రాండ్ లను కొనుగులు చేయడంతో ఈ తరహా మార్కెటింగ్ జోరందుకుంది. సోషల్ మీడియా నెట్ వర్క్ ద్వారా కూడా తమ ఉత్పత్తుల గురించి ప్రచారం చేసుకుంటూ లాభాల్ని గడిస్తున్నాయి ఫారిన్ బ్రాండ్స్. ముఖ్యంగా సోషల్ మీడియా నెట్ వర్క్ లలో ఇన్ స్టాగ్రాం కంపెనీ ఉత్పత్తుల ప్రచారానికి వేదికగా నిలిచింది. ఈ ప్రచారానికి ఒక్కో పోస్ట్ కు కోట్లలో వసూలు చేస్తున్నారు సినీ సెలబ్రిటీలు. మరి ఇప్పుడు ప్రధాని పిలుపుతో వారు అంతటి ఆదాయాన్ని వదులుకొని.. ఫారిన్ బ్రాండ్స్ కి మాత్రమే ఎండార్స్ చేసే పద్దితికి ఇక స్వస్తి చెప్పి లోకల్ బ్రాండ్స్ కి ప్రమోట్ చేస్తారా..?
అయితే ఎంతమంది నటీనటులు.. మిగతా సినిమాకి సంబంధించిన వాళ్లు ఈ రెస్పాన్సిబిలిటీని తీసుకొని లోకల్ బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తారనేది చూడాలి. అయితే అసలు మోదీ ఈ మాట చెప్పినట్లుగా సినిమా వాళ్లలో ఎంత మందికి తెలుసు అనే సందేహం కూడా కలుగుతోంది. తెలిసినా ఎంతమంది స్థానిక ఉత్పత్తులను ప్రజలకు చేరవేయడానికి ముందుకొస్తారో చూడాలి. అయితే సామాజిక బాధ్యతగా ఫీల్ అయిన సినీ ఇండస్ట్రీ పెద్దలు మాత్రం స్టార్స్ అందరు ఫారిన్ బ్రాండ్స్ కి మాత్రమే ఎండార్స్ చేసే పద్దితికి ఇక స్వస్తి చెప్పి.. ఇకపై ఇండియన్ బ్రాండ్స్ ని జనాల్లోకి తీసుకెళ్లాలని.. మన దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడంలో భాగస్వామ్యం అవ్వాలని సూచిస్తున్నారు. మరి మన స్టార్ హీరో హీరోయిన్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.