Begin typing your search above and press return to search.
కేసీఆర్ సన్నిహితులకు అన్ని కష్టాలు ఉంటాయా?
By: Tupaki Desk | 17 Jun 2022 3:30 AM GMTఅత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారు.. పవర్ ఫుల్ వ్యక్తులతో ఉండే పరిచయానికి మించిన లక్ మరొకటి ఉండదని చాలామంది అనుకుంటారు. కానీ.. అలాంటి వాటితో ఉండే కష్టం అంతా ఇంతా కాదన్న మాట ఇప్పుడో హాట్ టాపిక్ గా మారింది. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన వారికి ఎదురయ్యే ఇబ్బందులు అన్ని ఇన్ని కావని చెబుతున్నారు. విలక్షణ వ్యక్తిత్వానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కేసీఆర్ కు సన్నిహితంగా ఉండటం అనేది.. అరచేతిలో అగ్నిని పెట్టుకొని తిరగటం మాదిరే ఉంటుందంటున్నారు.
ఎవరిని అంత తేలిగ్గా దగ్గరకు తీసుకోని కేసీఆర్ కు మరో సిత్రమైన అలవాటు గురించి చాలామందికి తెలిసిందే. ఎవరిని ఎంతకాలం తనకు సన్నిహితంగా ఉంచుతారో తెలీదని చెబుతారు. కొంతకాలం బాగానే ఉన్నా.. హటాత్తుగా వారిని దూరం పెట్టేయటం.. కాంటాక్టు చేసేందుకు సైతం అవకాశం లేకుండా చేయటం కేసీఆర్ కే చెల్లుతుందని చెబుతారు. తాను ఎంత సన్నిహితమన్న విషయాన్ని సదరు వ్యక్తి ఎలా వాడుతున్నారన్న దానిపై కేసీఆర్ కు ప్రత్యేక నజర్ ఉంటుందని చెబుతారు.
ఆయనకు సన్నిహితం కావటం ఎంత కష్టమో.. ఒకసారి సన్నిహితుడిగా మారిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవటం.. కంటిన్యూ చేయటం అంతకు రెట్టింపు కష్టంగా అభివర్ణిస్తారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే వారి సమయం వారి చేతుల్లో ఉండదన్న మాట వినిపిస్తూ ఉంటుంది.
ఉన్నట్లుండి సీఎం వ్యక్తిగత అధికారులు ఫోన్లు చేయటం.. వెంటనే సారు పిలుస్తున్నారని చెప్పటం.. హడావుడిగా వచ్చిన ఆ ముఖ్యుల్ని కూర్చోబెట్టుకొని తాపీగా కొన్ని అంశాలు గంటల కొద్దీ చర్చిస్తూ కాలయాపన చేయటం.. మొదట బాగానే ఉన్నా.. కాలం గడిచే కొద్దీ.. ఇదెక్కడి గొడవరా బాబు అనుకునేలా ఉంటుందని చెబుతారు.
అలా అని కేసీఆర్ లాంటి ప్రముఖుడి పరిచయమే మహా అద్భుతంగా భావించే పరిస్థితుల్లో.. ఆయనకు సన్నిహితుడన్న ట్యాగ్ ను పోగొట్టుకోవటం ఇష్టం లేక.. దాన్ని కంటిన్యూ చేసుకోవటం కోసం పడే తిప్పలు అన్ని ఇన్ని కావంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఉన్నట్లుండి దూరం పెట్టటం.. కొంతకాలం ఉలుకు పలుకు లేకుండా పోవటం లాంటి అదనపు ఆఫర్లు ఉండనే ఉంటాయని చెబుతారు.
ఇంతా చేసి.. ఏదైనా వ్యక్తిగత పనుల గురించి ఆయన ముందు మాట్లాడే పరిస్థితి ఉండదని చెబుతారు. దగ్గరగా ఉంటూనే.. తెలీని దూరాన్ని మొయింటైన్ చేసే సత్తా కేసీఆర్ సొంతమని చెబుతారు. అందుకే.. కేసీఆర్ కు సన్నిహితుడన్న ట్యాగ్ లైట్ చూసేందుకు.. వినేందుకు బాగానే ఉన్నా.. దాన్ని తగిలించుకున్నోడికి ఉండే కష్టాలు అన్ని ఇన్ని కావంటారు. కేసీఆరా మజాకానా!