Begin typing your search above and press return to search.
కేసీఆర్ హెచ్చరికలు ఎమ్మెల్యేలపై పనిచేస్తాయా?
By: Tupaki Desk | 18 Oct 2021 7:37 AM GMTకర్ర విరగకుండా పాము చచ్చేలా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హెచ్చరికలు పంపాడట సీఎం కేసీఆర్.. తోక జాడించిన వారి లెక్క సరిచేయడంలో కేసీఆర్ ను మించిన నేత మరొకరు ఈ వర్ధమాన రాజకీయాల్లో లేరంటారు. మిగిలిన రాజకీయ పార్టీలకు భిన్నంగా పార్టీపై బలమైన పట్టును సాధించడంలో కేసీఆర్ ముందుంటారు.
గత ఎన్నికల సమయంలో ఎంత వ్యతిరేకత ఉన్నా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కేసీఆర్ టికెట్లు ఇచ్చాడు. కేవలం బాగా వ్యతిరేకత ఉన్న ఏడుగురిని మాత్రమే మార్చి కొత్త వారిని బరిలో దింపాడు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేల పనితీరును గ్రేడ్ల వారీగా శూలశోధన చేసిన కేసీఆర్ వచ్చే ఎన్నికలకు అదే విధానాన్ని అవలంభించాలని డిసైడ్ అయ్యాడు.
గతంలో మాదిరి ఈసారి ముందస్తు ఎన్నికలు ఉండవని కేసీఆర్ నిన్న స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈసారి ప్రభుత్వం పూర్తికాలం పనిచేస్తుందని కేసీఆర్ స్పష్టం చేశాడు. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరు మీద కేసీఆర్ గ్రౌండింగ్ చేయించాడు. అందులో చాలా మంది ఏ గ్రేడ్ లో ఉంటే.. కొందరు మాత్రం బీ, సీ గ్రేడుల్లో ఉన్నారు.
గత ఎన్నికల్లో చివరి గ్రేడ్ లో ఉన్న వారి పనితీరు మార్చుకోవాలని చెప్పిన కేసీఆర్ ఇప్పటికైనా మారని వారికి ఈసారి టికెట్లు ఇచ్చేది లేదని స్ఫష్టం చేస్తున్నారట.. టికెట్ల ఎంపికకు తాను జరిపే సర్వేలో వచ్చే గ్రేడ్లను ఆధారంగా తీసుకుంటానన్న విషయాన్ని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు.
కొత్త వారితో కంటే పాత వారికే టికెట్లు ఇవ్వడానికి తాను ఇష్టపడుతానని చెప్పడం ద్వారా సిట్టింగులకే మరోసారి టికెట్ ఖాయమన్న విషయాన్ని కేసీఆర్ స్పష్టం చేశారు.
కొత్త వారిని తీసుకొని వారిని తయారు చేయడానికి టైం పడుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. అదే పాత వారు, అనుభవం ఉన్న వారు అయితే త్వరగా ప్రజల్లోకి వెళ్లి గెలవవచ్చు. అదే కేసీఆర్ ప్లాన్ గా తెలుస్తోంది. కేసీఆర్ నిర్ణయంపై సిట్టింగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.