Begin typing your search above and press return to search.

శృంగారానికి ముందు వీటిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదట

By:  Tupaki Desk   |   3 March 2021 1:30 AM GMT
శృంగారానికి ముందు వీటిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదట
X
ఏదో మమ అనుకునే వారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. శృంగారాన్నిఎంజయ్ చేసే వారిలో ఉండే హుషారే వేరుగా ఉంటుందని చెబుతారు. భాగస్వామిని బాగా సంతృప్తి పరచాలనే ఆశ చాలామందిలో ఉంటుంది. కానీ.. చేయలేకపోతారు. మరి.. ఆ ఇబ్బందిని అధిగమించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు అని చెబుతున్నారు. సంభోగానికి మధ్యలో ఆటంకం కలిగించే వాటిలో మనం తినే ఆహారం కీలకభూమిక పోషిస్తుందట. శృంగారానికి మనం తినే ఆహారానికి మధ్య లింకు ఉందన్న విషయాన్ని నిపుణులు చెబుతున్నారు.

శృంగారానికి ముందు కాఫీ ఎంత తక్కువ తాగితే అంత మంచిదని చెబుతున్నారు. అసలు తాగకపోతే మరీ మంచిదట. ఎందుకంటే.. ఇందులో ఉండే కెఫిన్ కార్టిసాల్ హార్మోన్లపై ఒత్తిడిని పెంచుతుందట. అంతేకాదు.. రొమాన్సుకు ముందు ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినకుండా ఉంటే చాలా మంచిదట. ఎందుకంటే.. ఉప్పు ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరంగా ఉంటుందని.. శృంగార వేళ భాగస్వామిని ఎక్కువగా సంతృప్తి పర్చకుండా అడ్డుకుంటుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఆహారంలో ఉల్లిపాయను చాలామంది చేరుస్తారు. అయితే.. రాత్రిళ్లు ఉల్లిని డిలీట్ చేస్తే మంచిదట. ఎందుకంటే సెక్సు చేసే సమయంలో శరీరం నుంచి వచ్చే ఉల్లి వాసన భాగస్వామికి ఇబ్బందికరంగా ఉంటుందని చెబుతున్నారు.

కాలీఫ్లవర్.. క్యాబేజీ.. బ్రోకలీ లాంటివి శృంగారానికి ముందు తీసుకోకపోవటమే మంచిదట. అంతేకాదు.. పాలు పదార్థాలు కూడా హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేస్తాయని.. అందుకే జున్నును సెక్సుకు ముందు ఎవాయిడ్ చేస్తే మంచిదట. అంతేకాదు.. సెక్సుకు ముందు సోయా పాలు కూడా వద్దంటున్నారు. ఎందుకంటే ఇందులోని ఫైటో-ఈస్ట్రోజెన్ లు హార్మోన్లు ప్రభావితం చేసి.. ఆ సుఖాన్ని కాస్త తగ్గిస్తాయట. సో.. ఎంజాయ్ చేయాలనుకునే వేళలో వీటిని అవాయిడ్ చేస్తే.. భాగస్వామిని బాగా ఎంజాయ్ చేసే వీలుందని చెబుతున్నారు.