Begin typing your search above and press return to search.

లేనిపోని ఆరోపణలతో చిత్రపురిని అవమానించొద్దు!

By:  Tupaki Desk   |   3 July 2021 9:51 AM GMT
లేనిపోని ఆరోపణలతో చిత్రపురిని అవమానించొద్దు!
X
24 శాఖల సినీకార్మికుల‌కు కేటాయించిన‌ ఎం.ప్ర‌భాక‌ర్ రెడ్డి చిత్ర‌పురి కాల‌నీ ఇండ్ల కేటాయింపుల్లో అవ‌క‌త‌వ‌క‌ల‌పై చాలాకాలంగా ఉద్య‌మాలు న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే చిత్ర‌పురి అవ‌క‌త‌వ‌క‌ల్లో భాగంగా ప‌లు రాజ‌కీయ పార్టీల‌కు చెందిన నాయ‌కులు ఉన్న‌తాధికారుల్లో సినిమా రంగంతో ఎలాంటి సంబంధం లేని ఎంద‌రో ఫ్లాట్లు పొంది ఉన్నార‌ని స‌వివ‌రంగా ఓ ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక‌లో క‌థ‌నం వెలువ‌డ‌డం సంచ‌ల‌న‌మైంది. ఆ క్ర‌మంలోనే చిత్రపురి ప్ర‌స్తుత క‌మిటీ హుటాహుటీన నేడు మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి త‌మ చిత్త‌శుద్ధిని వివ‌రించే ప్ర‌య‌త్నం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

క‌స్తూరి శ్రీ‌నివాస్ అనే వ్య‌క్తి చిత్రపురి అవ‌క‌త‌వ‌క‌ల‌పై ఉద్య‌మాలు చేస్తున్నాడ‌ని అత‌డికి ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే ఇలా గ‌డ‌బిడ చేస్తున్నాడ‌ని చిత్ర‌పురి ప్రెసిడెంట్ అనీల్ కుమార్ వ‌ల్ల‌భ‌నేని అన‌డం హాట్ టాపిక్ గా మారింది. ``ఇక్కడ గొడవ చేస్తున్న వాళ్లకు ఫ్లాట్ ఇచ్చేస్తే గొడవలు వుండవు కానీ.. నేను ఇందులో ఒక ఉద్యోగిని మాత్రమే. ఫ్లాట్ ఇవ్వాలి అంటే కమిటీ మొత్తం సమ్మతం తెలపాల్సి వుంటుంది`` అని అన‌డం చ‌ర్చ‌కు తెర తీసింది.

ప్రెసిడెంట్ అనిల్ కుమార్ వల్లభనేని మాట్లాడుతూ..``1991 లో గవర్నమెంట్ ఇచ్చిన ఈ ల్యాండ్ అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని 2005 లో మా చేతికి వచ్చింది. దాసరి పుట్టిన రోజు సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ 24 కోట్ల రూపాయల పన్నులను రద్దు చేశారు. రోశయ్య గారి చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. ఆ త‌ర్వాత జనరల్ బాడీ మీటింగ్ లు పెట్టి ఏ ఫ్లాట్ కి ఎంత రేటు అనేది అందరికీ చేప్పాం.ఫ్లాట్స్ ను చిత్రపురి సొసైటీ ఏలాట్ చెయ్యదు`` అని తెలిపారు.

కమిటీ ఎంత మంచి చేసినా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే వుంటారు. మా కమిటీ వచ్చిన తరువాత ఎంఐజీ నిర్మాణాలు ఆగకుండా పనులు చేయించాము. MIG- డూప్లెక్స్ హౌస్ లు ఈ సంవత్సరం డిసెంబర్ లో ఇస్తాము... అని తెలిపారు.

చిత్ర పురి హౌసింగ్ లో కొందరు సభ్యులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. MIG ఫ్లాట్స్ లో అందరూ వచ్చాకా బహిరంగంగా చర్చిద్దాం అని చెప్పాం. 2019 వరకు ఏ ఉద్యమం లేదు. కానీ శ్రీనివాస్ అనే వ్యక్తి చిత్ర పురి సాధన సమితిని ఏర్పాటు చేసి ఏవో ఆరోపణలు చేస్తున్నారు. సినీ పరిశ్రమ తో సంబంధం లేని వాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ గొడవలు సృష్టిస్తున్నారు. వాళ్లకు ఆధారాలు వుంటే గవర్నమెంట్ కి అప్పచెప్పాలి కానీ మీడియాకి ఎక్కడం ఏమిటి? అని ప్ర‌శ్నించారు.

మా కమిటీ వచ్చాక పిబ్రవరిలో ఎన్విరాన్ మెంట్ పర్మిషన్ వచ్చింది. ఎవరికి ఏ సహాయం కావాలి అన్నా మా కమిటీకి చెప్పండి. పరిష్కరిస్తామని అన్నాము. కానీ కస్తూరి శ్రీనివాస్ అనే వ్యక్తి కమిటీ తో గొడవ పడి లబ్ది పొందడం అతని మోటోగా మ‌లుచుకున్నాడు.. కస్తూరి శ్రీనివాస్ ట్రిపుల్ ప్లాట్ బెడ్ రూమ్ ఇస్తే ఈ ఉద్యమం ఉండదు.. అని ప్ర‌త్యారోప‌ణ‌లు చేశారు.

ఈరోజు గొడవ చేస్తున్న వాళ్ల డిమాండ్ ను ఈ కమిటీ ఒప్పుకోకపోవడంతో ఈ రగడ జ‌రుగుతోంద‌ని కొత్త గా గెలిచిన మా కమిటీ అంతా ప‌నుల్లో నికార్సుగా వుందని అన్నారు. ఎలాంటి విషయాలు వున్నా జనరల్ బాడీ మీటింగ్ లో చర్చిద్దాం అని చెప్పాం కానీ వాళ్ళు ఏదో ఒక కుట్ర పన్ని మీటింగ్ జరగకుండా చేస్తారని అన్నారు.

చిత్ర పురిని అవమాన పర్చవద్దు. ఎవరి దగ్గరైనా ఆరోపణలు వుంటే కమిటీ ముందుకు ధైర్యంగా రండి చర్చించండి. లేని పోని ఆరోపణలు చేసి చిత్ర పురిని అవమానించొద్దు! అని కోరారు.

MiG- డుప్లెక్స్ సభ్యులకు ఈ డిసెంబర్ లోపు ఇండ్ల‌ పూర్తి చేసి ఇస్తాము. ఇవ్వకపోతే ఆరోజు మమ్మల్ని నిలదీయండి. దయచేసి మేము చేస్తున్న పనులను అడ్డోకోవద్దు అని కోరారు. సభ్యులు ఎవ్వరూ అధైర్య పడవద్దు మా కమిటీ అంతిమ లక్ష్యం సభ్యులు అందరికీ గృహ ప్రవేశాలు చేయిస్తామ‌ని ప్రామిస్ చేశారు.