Begin typing your search above and press return to search.
మా అమ్మకి సిలిండర్ తీయకండి , చనిపోతుంది .. ఓ కొడుకు ఆవేదన, జరిగిందేంటి ?
By: Tupaki Desk | 29 April 2021 11:30 AM GMTదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంటే ..మరోవైపు ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తుంది. దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత భారీగా వేధిస్తుంది. కరోనా కంటే ఆక్సిజన్ అందక చనిపోతుండటం విచారకరం. ఇదిలా ఉంటె .. ఆగ్రా ఓ వ్యక్తి తన తల్లికి పెట్టిన ఆక్సిజన్ సిలిండర్ తొలగించవద్దని, తీసేస్తే చచ్చిపోతుందని ఏడుస్తూ పోలీసుల కాళ్ళమీద పడ్డాడు. అక్కడి ఓ ప్రైవేటు ఆసుపత్రి ముందు ఈ నెల 27 న కనబడినసన్నివేశం ఇది. సిటీలోని సదర్ హాస్పిటల్ వద్ద ఏ కారణం వల్లో కొన్ని ఆక్సిజన్ సిలిండర్లను బయటకు చేర్చారు. అయితే కోవిడ్ తో బాధ పడుతున్న తన తల్లిని ఈ ఆసుపత్రిలో అడ్మిట్ చేశానని, కానీ ఆమెనుంచి సిలిండర్ తొలగించారని ఆ వ్యక్తి బావురుమన్నాడు. ఓ సిలిండర్ ను హాస్పిటల్ నుంచితెచ్చి బయట ఉన్న అంబులెన్స్ లోకి చేర్చారు ఒకరిద్దరు వ్యక్తులు, కాగా తన తల్లిని తిరిగి తీసుకువస్తానని తన కుటుంబానికి ప్రామిస్ చేశానని, దయచేసి ఆక్సిజన్ సిలిండర్ ని తొలగించవద్దని ఆ వ్యక్తి పోలీసుల కాళ్ళావేళ్ళా పడ్డాడు.
మరో సిలిండర్ ను తాను ఎక్కడినుంచి తేవాలని కూడా అన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూత్ కాంగ్రెస్ దీన్ని విడుదల చేస్తూ యూపీలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయని ట్వీట్ చేసింది. అయితే , పోలీసుల కథనం మరోలా ఉంది. ఆగ్రాలో రెండు రోజుల క్రితం ఆక్సిజన్ కొరత ఏర్పడిందని, దీంతో కొందరు వ్యక్తులు తమ పర్సనల్ సిలిండర్లను హాస్పిటల్స్ కి ఇస్తున్నారని , ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఖాళీగా ఉన్న ఆక్సిజన్ సిలిండర్ ను తీసుకువెళ్తున్నట్టు ఉందని, కోవిడ్ రోగి అయిన తన తల్లికి కూడా సిలిండర్ ఏర్పాటు చేయాలని మరో వ్యక్తి కోరుతున్నట్టు ఇందులో ఉందని ఆగ్రా ఎస్పీ చెప్పారు. ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని ఆయన వివరించారు. ఈ తరహా వీడియోలు పెడితే కఠిన చర్యలు తప్పవు అని అన్నారు.