Begin typing your search above and press return to search.
మీరు బాధపడకండి సార్.. చంద్రబాబుకు సోనూ ఫోన్.. పరామర్శ
By: Tupaki Desk | 22 Nov 2021 2:30 AM GMTఏపీలో `శుక్రవారం అసెంబ్లీ` ఘటన రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు.. యావత్ దేశాన్ని కూడా కదిలించి వేసింది. పార్టీలకు అతీతంగా ఇప్పటికే రాజకీయ నేతలు.. చంద్రబాబుకు జరిగిన అవమానాన్ని.. ఆయన సతీమణిని ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యేలు నిండు సభలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. అనేక మంది ఆయన పట్ల సానుభూతి కనబరిచారు. వైసీపీ ఎమ్మెల్యేల వైఖరిపై నిప్పులు చెరిగారు. నిజంగానే అది `కౌరవ సభ` అంటూ.. చంద్రబాబు మద్దతిచ్చారు. ఆయనకు అండగా ఉంటామని చెబుతూనే.. వైసీపీ నాయకులు తమ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.
ఇక..ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా.. బహుభాషా నటుడు.. వదల బొమ్మాళీ.. సోనూసూద్ కూడా చంద్రబాబుకు బాసటగా నిలిచారు. బాబుకు సోనూసూద్ ఫోన్ చేశారు. శుక్రవారం అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబంపై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో సోనూసూద్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబును ఊరడించారని తెలిసింది. మీరు బాధపడకండి సార్.. తప్పులు చేసిన వారే తలెత్తుకుని తిరుగుతున్నారు.. మీరు ఏ తప్పు చేయలేదు. మీకుటుంబం పులుకడిగిన ముత్యంలాంటిది. మీకు మేమంతా అండగా ఉన్నాం. అని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక అవ్వాల్సిన అసెంబ్లీలో ఇలాంటి ఘటన దురదృష్టకరమన్నారు.
శాసనసభలో విధ్వంసకర ధోరణి సరికాదని, హైదరాబాద్‌కు వచ్చినప్పుడు స్వయంగా కలుస్తానని సోనూసూద్ చంద్రబాబుకు చెప్పారు. ఇదిలావుంటే, గతంలో చంద్రబాబుపై సోనూసూద్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. కరోనా బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తున్న సమయంలో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో సోనూసూద్ పాల్గొని చంద్రబాబును అభినందించారు. హైదరాబాద్ నగరంతో పాటు ఉమ్మడి ఏపీ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను తాను ప్రత్యక్షంగా చూశానని అప్పట్లో సోనూసూద్ వ్యాఖ్యానించారు. తాజాగా చంద్రబాబు కష్టంలో ఉంటే.. సోనూన స్పందించడం.. విశేషం.
అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిపై చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మొదటిసారి విలపించారు. తన సతీమణి భువనేశ్వరిని ఉద్దేశించి అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు అనరాని మాటలు అన్నారని గద్గద స్వరంతో చెబుతూ... ఆయన ఆవేదన ఆపుకోలేక ఏడ్చేశారు. చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన విలపించిన సంఘటనను ఎవరూ చూడలేదు. అత్యంత బాధాకర సంఘటనల్లో కూడా కంటనీరు కూడా ఎవరి కంటపడకుండా నిగ్రహించుకోవడం ఆయనకు అలవాటు. ఆయన వెక్కివెక్కి విలపించడం మైక్‌లో స్పష్టంగా వినిపించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సోనూ స్పందన చంద్రబాబులో ధైర్యం నింపిందనే చెప్పాలి.